ఇలియానా అక్కడ టాటూ పొడిపించుకుంది(ఫొటో)
ముంబై: ''మారుతున్న ట్రెండ్లను కనిపెట్టడంలో నేను కాస్త అశ్రద్ధ చూపిస్తుంటాను. ఎవరో ఏదో చేశారని నేను కూడా వారిని అనుకరించను. స్వతహాగా నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా..'' అంటోంది ఇలియానా. బాలీవుడ్‌లో తనకంటూ ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకొంటోందీ భామ. అక్కడ హీరోయిన్స్ తో పోటీ పడడం అంటే మాటలా? అందుకే ట్రెండ్‌ని ఫాలో అవ్వక తప్పడం లేదు. మొన్నామధ్య ఓ ఫొటో షూట్‌లో ఘాటుగా కనిపించింది. ఇప్పుడు టాటూ పొడిపించుకోవాలని ముచ్చట పడుతోంది.

''టాటూ వేయించుకోవాలన్న ఆలోచన నాకు ఆలస్యంగా వచ్చింది. నా ఒంటికి టాటూ నప్పుతుందా? లేదా? అని తీవ్రంగా ఆలోచించాను. ఓసారి ప్రయత్నించి చూస్తా'' అంటోంది ఇలియానా. అంటే త్వరలోనే ఆమె ఒంటిపై పచ్చబొట్టు చూస్తామన్నమాట. టాటూ విషయంలో స్నేహితుల సలహా తీసుకొంటోంది.
'నాకు ఎలాంటి టాటూ అయితే బాగుంటుందో చెప్పండి. కొన్ని డిజైన్లు పంపండి' అంటూ ట్విట్టర్‌లో అభ్యర్థన పంపింది. అంతేకాక తన చేతిపై ఓ టాటుని గీయించుకున్నానని ఆమె తెలియచేసింది. "inspirare" అనే అర్దం వచ్చే లాటిన్ పదం ఆమె గీయించుకున్నాని ఈ ఫొటో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఆమెకు ఎక్కడ ఏ విధంగా టాటూవేయించుకోవాలో చెప్తూ ట్వీట్స్ వస్తున్నాయి. ఇంక ఎంతమంది ఎలా స్పందిస్తారో, ఎలాంటి టాటూతో ఇలియానా మెరిసిపోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











