ఆ రాక్షసి జూ ఎన్టీఆర్, రాణాలను లైన్ లో భలే పెడుతోంది...!
ఇలియానా తమలాంటి హీరోయిన్స్ అందం గుట్టు విప్పి చెప్పింది. అలాగే తన సౌందర్య రహస్యం చెపుతూ...యోగా, ధ్యానం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం ఇవేమీ కావు. ఓ చిరునవ్వు...మన మొహాలు మీద ఉండాలి అంతే అంది. అలాగే చాలామంది అందం కోసం ఏవేవో చేస్తారు. క్రీములూ, చిట్కాలూ అంటూ పరుగులు తీస్తారు. నా దృష్టిలో ఇవన్నీ అనవసరం. మనసారా నవ్వితే ఆ కాంతి ముఖంలో ప్రతిఫలించేలా చేస్తుంది. మరింత అందం తీసుకొస్తుంది అని చెప్పింది ఇలియానా.
ప్రస్తుతం ఇలియానా...ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో నటిస్తోంది. అలాగే మహేష్, శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ లోనూ ఆమె కమిటయ్యింది. అలాగే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రాణా హీరోగా రూపొందుతున్న నేనూ...నా రాక్షసి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె రాణాతో 'నేను నా రాక్షసి"లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ తో 'శక్తి" సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసం హంపి వెళ్లింది. అక్కడ దాదాపు 15 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరపనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











