మరక మంచిదే అంటూ...ఇలియానా!

By Bojja Kumar

మరక మంచిదే అంటూ ఓ వాణిజ్య ప్రకటనలో అన్నట్లు...అపజయాలు కూడా మంచివే అంటోంది సెక్సీ స్టార్ లెట్ ఇలియానా. అపజయాలు పలకరించినప్పుడే ఆత్మవిమర్శకు అవకాశం దొరుకుతుందని కొత్త ఫిలాసఫీ చెబుతోంది. ఈ ఏడాది ఇలియాన నటించిన 'నేను నా రాక్షసి' 'శక్తి' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఇలియానా క్రేజ్ పరిశ్రమలో అమాంతం పాతాళానికి వెళ్లిపోయింది.

ఈ విషయమై ఇలియాన స్పందిస్తూ... 'ఈ సంవత్సరం నేను చేసిన తెలుగు సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో కెరీర్‌లో కొంచెం విరామం లభించింది. ఈ సమయంలోనే తీరిగ్గా కథల్ని వినే అవకాశం లభించింది. అదే సమయంలో నన్‌బన్ తీ ఇడియట్స్ తమిళ రీమేక్) కథ ఓకే చేశాను. ఈ సినిమాతో తిరిగి పుంజుకుంటానన్న నమ్మకముంది' అని చెప్పింది ఇలియాన. 'నన్‌బన్' చిత్రం తెలుగులో 'స్నేహితుడు' పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది.

ఒకప్పుడు అగ్రకథానాయికగా వెలుగొందిన ఇలియాన విపరీతమైన స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేసింది. తనకు కావాల్సినంత రెమ్యూనరేషన్ నిర్మాతల ముక్కు పిండి మరీ వసూలు చేసేది. కానీ పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మరి ఇకముందైనా ఇలియానా పుంజుకుంటుదో? లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X