ఈ నడుము, నాభి చూసే...ఇలియానాకు పడిపోయారు(ఫోటో)
హైదరాబాద్ : బాలీవుడ్ మోజులో పడిన ఇలియానా అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని తన శక్తి మేర ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె నటించిన 'బర్ఫీ' చిత్రం మంచి విజయం సాధించడంతో షాహిద్ కపూర్ సరసన 'పథా పోస్టర్ నిఖ్లా హీరో' అనే చిత్రంలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది.
కాగా...ఒకప్పుడు ఇలియానాను సన్ననడుము సుందరి అంటూ దక్షిణాది ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు తన నడుము, నాభి అందాలను మరింత సెక్సీగా ప్రదర్శిస్తూ బాలీవుడ్ బాబులను తన బుట్టలో పడేసుకునే ప్రయత్నం చేస్తోంది ఇలియానా. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి తన నడుము అందాలను ఆరబోసింది.

బాలీవుడ్ మోజులో పడి సౌత్ సినిమాల పూర్తిగా దూరం పెట్టింది ఈ భామ. ప్రస్తుతం ఇలియానా దక్షిణాది సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడం లేదు. సౌత్ లో ఆమె తమిళం, తెలుగు భాషల్లో నటించిన సినిమాలు వరుసగా ప్లాపవ్వడంతో ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. కొందరు ఆమెతో చేద్దామని వెళ్లినా నాది బాలీవుడ్ రేంజి అని చెప్పుకుంటూ వాళ్ల దిమ్మదిరిగేలా కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. దీంతో చాలా మంది నిర్మాతలు భయపడి పారిపోతున్నారు. అయితే ఇల్లూ బేబీ మాత్రం తాను బాలీవుడ్లో బిజీగా ఉండటం వల్లనే దక్షిణాది సినిమాలు చేయడానికి వీలు కావడం లేదని చెప్పుకుంటోంది.


Click it and Unblock the Notifications











