న్యూడ్ ఫోజులే సినిమా అవకాశాలు తెస్తాయట!
పోకిరి సూపర్ హిట్ తర్వాత ఇలియాన రేంజ్ అమాంతం పెరిగి పోయింది. వరుస అవకాశాలతో ఇటు టాలీవుడ్ తో పాటు ఇతర దక్షిణాది సీని పరిశ్రమల్లో తన హవా కొనసాగించింది. అయితే ఈ మధ్య ఇలియాన నటించిన సినిమాలు వరుసగా ప్లాపుల బాట పట్టడంతో అమ్మడు కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడి పోయింది. అవకాశాలు మందగించాయి. బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రైచేసినా మెయిన్ హీరోయిన్ అవకాశం దక్కలేదు. రణబీర్ కపూర్ నటిస్తున్న బర్ఫీ చిత్రంలో సెకండ్ హీరోయిన్ అవకావం మాత్రమే దక్కింది. ఈ నేపథ్యం ప్రముఖ దర్శకుడు శంకర్ తీయబోతున్న త్రీ ఇడియట్స్ చిత్రంలో, బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఇలియానాకు అవకాశం దక్కడం ఆమెకు కాస్త ఊరట కలిగించే విషయం.
మళ్లీ తన సినీ కెరీర్ పంజుకోవడానికి ఇదే మంచి సమయం అని భావిస్తున్న ఇలియానా...మరింత మంది దర్శకనిర్మాతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ప్రముఖ మ్యాగజైన్ల కోసం టాప్ లెస్ గా సెమీ న్యూడ్ ఫోజులు ఇచ్చి టాప్ హీరోయిన్లు గా మారిన నేపథ్యంలో తాను కూడా వాళ్ల బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తూంది. ఈ మేరకు ఇప్పటికే ఓ మ్యాగజైన్ కోసం సెమీన్యూడ్ ఫోటో షూట్ కోసం సిద్ధం అవుతోందట. మరి ఇలియాన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











