నా వయస్సు అమ్మాయిల్లా నేనూ మొదలెట్టాల్సిందే: ఇలియానా
నా వయసున్న అమ్మాయిలంతా ఎంచక్కా బైకులు, కార్లు నడిపేస్తున్నారు. నేను మాత్రం ప్రతీసారీ క్యాబ్ కి ఫోన్ చేయాల్సి వస్తోంది. పోనీ నేర్చుకుందామంటే సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచి ఎక్కడా ఖాళీ దొరకనంత బిజీ అని వాపోతోంది ఇలియానా. ఆమెకు సొంతంగా మూడు కార్లు ఉన్నా ప్రతీసారీ డ్రైవర్ మీద ఆధారపడాల్సివస్తోంది. అలా ఎందుకు అంటే...డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఖాళీ దొరకటం లేదు. ఇప్పుడూ ఖాళీగా లేను కానీ...తప్పదు అని డిసైడయ్యాను. త్వరలోనే మీ ముందు సొంతంగా డ్రైవింగ్ చేస్తూ చక్కర్లు కొట్టాస్తానంటోంది. అందుకే గోవాలో మంచి డ్రైవింగ్ స్కూల్ కోసం ఎంక్వయిరీ చేస్తున్నాను. షూటింగ్స్ లేనప్పుడు నేను గోవా వెళ్ళి మొదలెట్టేస్తాను అంది. అలాగే నాకు కారు మాత్రమే కాదు... నాకు టూ వీలర్ కూడా నడపడం రాదండి అంటోంది. ఇక ప్రస్తుతం ఇలియానా..ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో చేస్తోంది. అలాగే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఆమె రానా సరసన నేనూ నా రాక్షసి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











