ఇంటి వేటలో బిజీగా ఇలియానా
ఇలియానా ఇప్పుడు ఇల్లు వేటలో ఉంది. అయితే హైదరాబాద్ లో కాదు ముంబైలో...ఆమె అక్కడ అద్దె ఇల్లు కోసం సెర్చ్ చేస్తోంది. బాలీవుడ్ లో తను కంటిన్యూకాబోతున్నాను కాబట్టి అక్కడ ఇల్లు అవసరమేనన్నట్లుగా ఈ విషయమై కదిపిన మీడియాతో చెప్పింది. మీడియాతో మాట్లాడుతూ...నాకు ఇప్పుడు ముంబై ఎడ్రస్ ఉండటం లాజికల్ గా కరెక్టు...ఎందుకంటే నేను ఇప్పుడు సౌత్ సినిమాలు,బాలీవుడ్ సినిమాలు రెండూ చేస్తున్నాను. అందుకే నేను ఇల్లు వెతుకుతున్నాను..త్వరలో మంచి ఇల్లు దొరుకుతుందని భావిస్తున్నాను అంది ఇలియానా. ముంబైలో హోటల్స్ లో ఉండటం కన్నా సొంత ఇల్లు ఉండటం బెస్ట్ అని అక్కడి వారు చెప్పటంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.
ప్రస్తుతం ఈ గోవా భామ 'జులాయి' కోసం అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న ఈమె రవితేజతో రెండోసారి ఆడిపాడుతోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతన్న దేముడు చేసిన మనుష్యులు చిత్రంలో ఆమె నటిస్తోంది. అలాగే త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. తమిళ,హిందీ భాషల్లోనూ ఆమె బిజిగా ఉంది. సిని జీవితం గురించి ఇలియానా మాట్లాడుతూ ''కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే. విజయంవచ్చిందంటే... వెన్నంటే ఓటమి ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేశా. మధ్యలో ఆ వేగం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ మునుపటి జోరు వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం కూడా ఆనందంగా ఉంది''అని చెప్పింది.
ఇక దక్షిణాదిలో ఇలియానా కెరీర్ విషయానికి వస్తే, 'కిక్' తర్వాత వరుసగా ఐదు ఫ్లాప్‌లు రావడంతో ప్రస్తుతానికి ఇక్కడ డల్‌గానే ఉంది. ఈ మధ్యనే తమిళ దర్శకుడు శంకర్ తీసిన 'స్నేహితుడు' (అమీర్‌ఖాన్ '3 ఈడియెట్స్' రీమేక్)లో కనిపించిన ఈమెకు కలిసిరాలేదు. ఆ సినిమా ప్లాప్ కావటం ఆమెకు తెలుగులో ఇబ్బందికర పరిస్దితి తెచ్చిపెట్టింది. దాంతో ఆమె తన దృష్టి మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడిలో నటిస్తోంది. ఈ చిత్రం ఆమెకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోంది.
అక్షయ్ కుమార్ హీరోగా నిర్మించబోయే 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై 2', 'ఖిలాడీ 786' చిత్రాల్లో ఇలియానాకు అవకాశం సంపాదించింది. 2010లో ఏక్తా కపూర్ నిర్మించిన 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై'కి ఈ చిత్రం సీక్వెల్ . మాఫియా డాన్‌లు దావూద్ ఇబ్రహీం (అక్షయ్), చోటా రాజన్ (షాహిద్)ల మధ్య గల శతృత్వమే దీని ఇతివృత్తం. ఇక రెండో సినిమా 'ఖిలాడీ 786'ని హాస్య ప్రధాన చిత్రంగా అక్షయ్, హిమేష్ రేష్మియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో అనురాగ్ బసు రూపొందించిన 'బర్ఫీ'లో రణ్‌బీర్ కపూర్ భార్యగా ఇలియానా చేయటం ఆమెకు కలిసివచ్చింది. అయితే రిలీజైన తర్వాత గానీ ఆమె కేరీర్ ఏ రేంజికి వెళ్తుందో చెప్పలేమంటున్నారు బాలీవుడ్ పండితులు.


Click it and Unblock the Notifications











