జూలై లో జల్సా సుందరికి పెళ్లంట!?
చూడబోతే ఈ సంవత్సరం మన తారామణుల్లో చాలా మందికి కళ్యాణ ఘడియాలు ముంచుకొస్తున్నట్టే కనిపిస్తోంది. రంబతో మొదలైన ఈ వివాహాల పర్వం, ఈ ఏడాది చివరికల్లా ఎవరి మెడలో తాళి పడ్డాక ఆగుతుందో చెప్పే వీల్లేదు. రంభ తరువాత సింధు మీనన్ పెళ్లి కూడా అయిపోయిన సంగతి తెలిసిందే.
మరో పక్క చాలా మంది యువ హీరోలు కూడా తాళి కట్టే తంతు కోసం 'క్యూ"లో నిలుచున్నారు. ఇక ఇప్పుడు ఇలియానా వంతు. సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఇలియానాకి పెళ్లి గంటలు మ్రోగె సమయం ఆసన్నమైందని వినికిడి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ఆలోచనలను పంచుకుంటూ నాకు తగ్గ మంచి జోడీ దొరకగానే వీలైనంత త్వరలో పెళ్లి చేసుకోడానికి నేను రెడీగానే ఉన్నాను. అబ్బాయి దొరకడమే ఆలస్యం అని చిన్న ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే జూలై నెలలో 'నేను పెళ్ళికి రెడీ' అని తను అంటుందని జోశ్యం చెబుతున్నారు ఈ గోవా సుందరి సన్నిహితులు. ఈ దాగుడు మూతలకు తెరదించగల సత్తా కాలానికే ఉంది మరి…కాదంటారా? వేచి చూద్దాం.


Click it and Unblock the Notifications











