»   » తనకు ఇష్టమైన బాలీవుడ్ స్టార్ తో ఇలియానా రొమాన్స్...

తనకు ఇష్టమైన బాలీవుడ్ స్టార్ తో ఇలియానా రొమాన్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంత హీరో,హీరోయిన్స్ అయినా వారికంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉంటాయి. తాజాగా ఇలియానా తనకు నచ్చిన హీరో, హీరోయిన్స్, సినిమా గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే..ఒకప్పుడు షారుఖ్ ఫ్యాన్ ని నేను అన్నారు. .ఆ తర్వాత హృతిక్‌ని ఇష్టపడ్డా. ఇప్పుడేమో సైఫ్ అలీఖాన్ అంటే ఇష్టం అంటూ తనకు నచ్చిన హీరోల గురించి చెప్పింది. మరి తెలుగు హీరోల్లో ఎవరిని ఇష్టపడతారు అనడిగితే ...ప్లీజ్ ఇలాంటి ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టకండి ప్లీజ్. ఇక్కడి హీరోలందరూ నా అభిమాన నటులే. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంది అంటూ తెలివిగా సమాధానమిచ్చింది.

ఏ ముహర్తాన ఆనోటి అన్నదో కానీ ఈ గోవా బ్యూటీ ఇలియానాకు ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల మీద అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే రణబీర్ కపూర్ సరసన నటించడానికి అంగీకరించగా, మరొక సినిమా ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నిర్మించబోయే సినిమాలో కూడా ఇలియానే హీరోయిన్.ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఏమిటంటే విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించబోయే సినిమాలో ఇలియానే హీరోయిన్ అని. ఇప్పటికే మాటలు అయిపోయాయని రాతలు మాత్రమే మిగిలి వున్నాయని అనుకుంటున్నారు. చేతన్ భగత్ అనే రచయిత రాసిన కధ ఆధారంగా రూపొందబోయే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరో. షారుఖ్ ఖాన్ కూడా ఆ పాత్రకి కొత్త హీరోయిన్ అయితే బావుంటుందని అనుకుంటున్నాడు.షారుఖ్ ఖాన్ సరసన నటించాలని ప్రతీ హీరోయిన్ కలలు కంటారు. ఇప్పుడు ఇలియానాకి మూడో సినిమాతోనే ఆ అవకాశం వచ్చేటట్లు వుంది. కాగా ఈ చిత్రాన్ని సైఫ్ ఆలీఖాన్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో చేయాలని అనుకొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వారు డ్రాప్ అవ్వడంతో ఆ అవకాశం షారుఖ్, అండ్ విశాల్ దక్కించుకొన్నారు.

English summary
After 'One Night At The Call Centre' and '3 Idiots', another Chetan Bhagat’s novel is going to make as a film i.e, '2 States'. Vishal Bhardwaj directing this film with Shahrukh Khan in main lead. Previously Saif Ali Khan suppose to act under Siddharth Anand direction but finally Shahrukh Khan and Vishal Bhardwaj working for this film, according to film nagar news Ileana will pair with Shahrukh Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu