కిక్ సుందరి మల్లన్నతో జోడి
టాలీవుడ్ యంగ్ హీరోలతో జతకట్టిన పొడవుకాళ్ల సుందరి ఇలియానా తాజాగా విలక్షణ నటుడు, "మల్లన్న" హీరో విక్రమ్ సరసన నటించేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే తమిళతెరకు పరిచయమైన ఇలియానాకు విక్రమ్‌తో చేసే సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే..ఇప్పటికే "అరుంధతి" ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన "బిల్లా" సుందరి అనుష్క, తమిళ హీరోవిజయ్ సరసన నటిస్తోంది. ఇదే కోవలో ఇలియానా కూడా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇకపోతే..."7జి బృందావనం కాలనీ" దర్శకుడు సెల్వరాఘవన్ వినిపించిన స్క్రిప్ట్ విక్రమ్‌కు తెగ నచ్చేసిందని, ఆ కథ విని విక్రమ్ ఆశ్చర్యపోయాడని తెలిసింది. అంటే కథ అంత అద్భుతంగా ఉందని.. ధనుష్ తో సెల్వ చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే విక్రమ్‌తో సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రంగా, వైవిధ్య కథాంశంతో తెరకెక్కిన "మల్లన్న" విక్రమ్‌కు అంతగా మంచిపేరు సంపాదించిపెట్టకపోయినా..ఇలియానాతో చేసే తదుపరి ప్రాజెక్టు తప్పకుండా విజయాన్ని చేకూర్చుతుందని సినీ వర్గాల్లో టాక్. అంతేకాదు.. విక్రమ్‌తో చేసే ఛాన్స్ తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇలియానా తెగ సంబరపడిపోతుందట.! మొత్తానికి ప్రేక్షకులను అలరించేందుకు ఈ నూతన జంట తెరపైకి రానుందన్నమాట..! "24" అనే పేరిట రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్‌గర్ల్ విక్రమ్‌తో రొమాన్స్ చేయనుందని, ఈ సినిమా కోసం ఇలియానా ఇతర ప్రాజెక్టుల్లో సంతకం చేయకుండా వేచి ఉందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











