రాఘవేంద్రుడు సైతం ఇలియానా..
హీరోయిన్స్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టే దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇలియానాని తన తదుపరి చిత్రంలో తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మనోజ్ హీరోగా చేయనున్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోనున్నారు. ఇక రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ చిత్రం చూసిన రాఘవేంద్రుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. కిక్ లో ఆమె కాస్త ఒళ్ళు చేసి తన అందచందాలను ఆరబోసింది. అది చూసిన రాఘవేంద్రరావు ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకుని ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఆయన శిష్యుడు వైవియస్ చౌదరి ఆమెను పరిచయం చేయటం, తాజాగా సలీం చిత్రంలో సైతం ఆమే హీరోయిన్ గా చేయటం ఆయనను ఆకట్టుకుందని అంటున్నారు. ఇక మనోజ్ హీరోగా చేసిన ప్రయాణం ఈ నెల ఇరవై తొమ్మిదన రిలీజ్ కానుంది. అనంతరం ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మొత్తానికి రాఘవేంద్రరావు దృష్టిలో పడటం అంటే ఆమె దశ తిరిగినట్లే అంటున్నారు సీనియర్లు.


Click it and Unblock the Notifications











