దూసుకొస్తున్న ఇలియానా
ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాదిన నెంబర్ వన్ తారగా వెలుగొందిన ఇలియాన కొత్త హీరోయిన్ల జోరు, వరుస ప్లాపుల బేజారుతో కాస్త వెనకబడి పోయిన విషయం తెలిసిందే. వీటికి తోడు మళ్లీ తన కెరియర్ పుంజుకునేందుకు ఉపయోగ పడతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న 'నేను నా రాక్షసి" 'శక్తి" సినిమాలు తీవ్రంగా నిరుత్సాహపరచడంతో ఇలియానా పని అయిపోయిందని అంతా భావించారు.
ఈ తరుణంలో శంకర్ దర్శకత్వంలో 'నన్‌బన్" (హిందీ 'త్రీ ఇడియట్స్" తమిళ రీమేక్) చిత్రంలో భారీ ఆఫర్‌ను చేజిక్కిచ్చుకుంది ఈ సుందరి. ఈ చిత్రం జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో అరంగేట్రం చేస్తూ ఈ సుందరి 'బర్ఫీ" చిత్రంలో రణభీర్‌కపూర్ సరసన నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, సెకండ్ లీడ్ హీరోయిన్‌గా ఇలియానా నటిస్తోంది. ఇదిలా వుండగా అక్షయ్‌కుమార్ సరసన 'కిలాడీ 786" చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం లభించింది. అక్షయ్‌కుమార్ లాంటి పెద్ద స్టార్ హీరో చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేయడంతో బాలీవుడ్‌లో ఈ భామ దశ తిరిగిన ముంబై సినీ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఒక్కసినిమా విడుదల కాకముందే మరో సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సన్ననడుము సుందరి.
తాజాగా ఇలియాన తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించన్ను చిత్రంలో ఇలియానా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇలా వరుస సినిమాలతో మళ్లీ నెంబర్ స్థానానికి దూసుకొస్తోంది ఇలియాన. వీటిలో కనీసం రెండు సినిమాలు హిట్టయితే ఇలియాన కెరియర్ కు తిరుగు ఉండదు అంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











