ఇలియానా ట్విస్టుకు బన్నీ దారికొచ్చాడు
జల్సా లో హీరోయిన్ గా చేసిన ఇలియానాని మళ్ళీ త్రివిక్రమ్ తాను బన్నీతో చేయబోయే చిత్రానికి తీసుకుందాముకున్నాడు. అయితే ఆమె సినిమాలు వరసగా ఫెయిల్యూర్ అవటంతో అల్లు అర్జున్ ఆమె వద్దని రిజెక్టు చేసేసాడు. దాంతో ఇలియానాకు ఎక్కడో కాలింది. అయితే అప్పటికే ఆమెకు అడ్వాన్స్ ఇచ్చేసారు. ఆ అడ్వాన్స్ ఆమె తొక్కి పట్టింది. చాలా రోజులుగా ఈ జంటతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇందునిమిత్తం ఇలియానాకు భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లించారట. అయితే సినిమా ప్రారంభించడానికి కొంత ఆలస్యమైంది. ఈలోపు ఇలియానాకు బదులు శ్రుతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది. విషయం తెలిసి ఇలియానా తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగిఇవ్వనని స్పష్టం చేసిందట. తనకుతానుగా నటించను అనలేదు కాబట్టి అడ్వాన్స్ ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేయడంతో నిర్మాత తలపట్టుకున్నాడు. ఎందుకంటే అడ్వాన్స్ అంటూ ఇచ్చింది పారితోషికంలో సగమట. దీంతో బన్నీ ఈ విషయం తెలిసి ఆమెనే ఖాయం చేయమన్నాడుట. అలా సర్దుబాటు ప్రయత్నంగా ఇలియానానే కన్‌ఫర్మ్ చేసుకున్నారని సమాచారం. ఇక ఇలియానా తెలుగులో కొత్త చిత్రం అంగీకరించక చాలా కాలం అవుతోంది. 'నేను నా రాక్షసి' ఫ్లాప్ తర్వాత ఆమెకున్న క్రేజ్ తగ్గిందని పరిశ్రమ వర్గాలు అంచనావేశాయి. అదే సమయంలో దర్శకుడు శంకర్ తీస్తున్న భారీ చిత్రంలో ఇలియానాకు అవకాశం వచ్చింది. గిట్టుబాటు కూడా బాగానే ఉండడంతో ఆ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చేసింది. పైగా శంకర్ సినిమా అంటే తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి సక్సెస్ అయితే తెలుగు మార్కెట్ పుంజుకుంటుందనేది ఆమె సన్నిహితులు ఆలోచన. అయితే శంకర్ సినిమా కొంత ఆలస్యమైంది.


Click it and Unblock the Notifications











