ఇలియానాకి 'నో' చెప్పిన డైరక్టర్ తేజ
స్టార్ హీరోయిన్ ఇలియానా కెరీర్ ప్రారంభంలో ప్రముఖ దర్శకుడు తేజ చిత్రంలో వేషం కోసం ట్రై చేసింది. అయితే ఆయనకు ఆమె నచ్చలేదు. దాంతో నో చెప్పారుట. ఈ మధ్య తన కెరీర్ గురించి ఆలోచిస్తూ ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకుంది. అప్పట్లో కొత్త తారలను పరిచయం చేస్తూ తేజ 'ధైర్యం' ప్లాన్ చేసారు. ఆ క్రమంలో ఎందరో హీరోయిన్స్ ని చూసారు. అప్పుడే తేజ నుంచి ఇలియానాకు కూడా కబురొచ్చింది. తెలుగు ఫీల్డ్ ని దున్నేయాలని ఆశతో ఆమె హైదరాబాద్ వచ్చింది. అయితే తేజకు ఆమె నచ్చలేదు. ఆయన స్వయంగా చేసిన ఆడిషన్ లో ఆమె ఫెయిలైంది. అప్పుడు హీరోయిన్ గా బెంగాళి పాప రైమాసేన్ ని నితిన్ సరసన ఎంపిక చేసి ఇలియానాకు సారి చెప్పేసారు. అయితే అప్పుడు ఆయన సినిమాలో ఎంపిక కాకపోయి ఉండటమే బెటర్ అంటోంది. ఎందుకంటే తన తొలి చిత్రమే ఫ్లాఫ్ అయి ఉండేదని. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె దేవదాసు తో తెలుగునాట అడుగుపెట్టి పోకిరితో సెటిలై..కిక్ తో కంటిన్యూ అవుతోంది.


Click it and Unblock the Notifications











