ఇలియానా చెల్లెలు కూడా
కిక్ తో అందరి మతులూ పొగొట్టిన ఇలియానా తన చెల్లెలిని కూడా రంగంలోకి దించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం ఆమె స్టార్స్ నైట్ పార్టీలకు చెల్లిని తోడుగా తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తోంది. అలాగే తమిళ, తెలుగు పరిశ్రమలలోని పెద్ద నిర్మాత, దర్శకులకు తన చెల్లెలు ఫొటోలు, వీడియోలు పంపి ఆఫర్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. అయితే ఆ మధ్య ఓ సక్సెస్ ఫుల్ చిన్న నిర్మాత ఒకరు ఆమెతో చేయటానికి ముందుకు వచ్చినా కాదని తిప్పికొట్టిందని తెలుస్తోంది.
లాంచింగ్ పెద్ద బ్యానర్ గానీ పెద్ద డైరక్టర్ తో గానీ లేదా పెద్ద హీరో సరసన గానీ అని తెలివిగా చెప్తోంది. అయితే వీటిల్లో ఏది ఓకే అయినా మిగతా రెండు అనుసరిస్తాయన్నది నిజం. అయితే ఆమె ఎక్కువ ఆశలు పూరీ జగన్నాధ్ మీద పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పర్శనల్ గా పూరీ ఆఫీసుకు రెండు మూడు సార్లుకి తీసుకెళ్ళి స్క్రీన్ టెస్ట్ లు అవీ చేయించారని వినికిడి. అంటే త్వరలోనే ఇలియానా చెల్లి కూడా మనకు కనువిందు చేయనుందన్నమాట. బెస్టాఫ్ లక్.


Click it and Unblock the Notifications











