30 నిమిషాలలో 6 పాటలు!!
నూతన దర్శకులు ఎవరైనా సినిమా ఫీల్డ్ లోకి వస్తే వారికి కూడా అందుబాటులో ఉంటాడు సంగీత సామ్రాట్టు ఇళయరాజా. వారి చిత్రాలకు సైతం చక్కని సంగీతాన్ని అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. తాజాగా మరో నూతన దర్శకుడి సినిమాకు కూడా ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు పి.వాసు వద్ద అసిస్టెంట్ గా పని చేసిన చంద్రనాథ్ తొలి చిత్రానికి ఇళయ రాజా సంగీత దర్శకుడిగా చేశారు. ఈ దర్శకుడి చిత్రానికి కేవలం 30 నిమిషాలలో ఆరు అద్భుత ట్యూన్ లను అందించి ఆశీర్వదించారు. లవ్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం పేరు కంగలుమ్ కవి పదుధే. ఈ సినిమాలో ఆకాష్, రజిత్, రతన్ లితిక, మృధుల, లక్షణ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications