ఇక అరవ వాళ్ళకే ఆమె....

By Staff

Illeana
'దేవదాసు' సినిమాతో పరిచయమై 'పోకిరీ' తో ప్రేక్షకులనాడి పట్టుకుని ఆడిస్తున్న అందగత్తె ఇలియానా. అయితే ఆమె సినిమాలు ఈ మధ్య తెలుగులో వర్కవుట్ కాలేదు. దాంతో కెరీర్ పరంగా ఆమెకు కొంత క్రేజ్ తగ్గింది. అందులో హన్సిక వంటి అందగత్తెలు ఫీల్డులోకి వచ్చి దున్నేయటం ఆమెకు మింగుడుపడంటం లేదు. అయితే ఎంతమంది అందగత్తెలు ఎక్కడ నుంచి వచ్చినా ఇలియానా గ్లామర్ ముందు నిలవలేకపోతున్నారనేది పూర్తి నిజం . అయితే టాలీవుడ్ లో ఆఫర్స్ పెద్దగా లేవని గమనించిన ఆమె టాలివుడ్ వైపు ఓ కన్ను వేసింది.

దాంతో ఇక్కడ లాగే అక్కడ కుర్రకారుని ఓ ఊపుఊపటానికి ఈ బక్కపలచని భామ రెడీ అయిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ ఆఫర్లతో యమ బిజీగా వుంది. సూర్య, విక్రమ్ వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రావటంతో తన మకాంను చెన్నైకు మార్చేసిందని టాలీవుడ్ సినీజనం బేలగా చెపుతున్నారు. కోలీవుడ్ అగ్ర దర్శకులు రూపొందించే చిత్రాలలో నటించనున్న ఈ సుందరి ముందు మరిన్ని అవకాశాలు వచ్చి వాలుతున్నాయట.

మరోవైపు 999... అంటూ సన్ టీవీ యాడ్‌లో యమ జోరు చేస్తున్న తమన్నా సైతం తనకు చెన్నై అచ్చొచ్చినట్లు చెపుతోంది. సెక్సీ సుందరి శ్రియ కూడా చెన్నైకు వచ్చి శివాజీ సరసన నటించి ప్రస్తుతం మాగ్జిమ్ పత్రిక ముఖ చిత్రం దాకా వెళ్లి అటునుంచి అటు బాలీవుడ్...హాలీవుడ్ అంటోంది కదా ..వీళ్ళందరి సంగతి ప్రక్కన పెడితే ఇలియానా అలా చెప్పాపెట్టకుండా వలస వెళ్ళిపోవటం ఆంధ్రా అభిమానులను మనో క్లేసానికి గురిచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X