ఇలియానా ...మజాకా

కానీ చిత్రంగా 'ఆట' తర్వాత ఇలియానా నటించిన చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గింది. మళ్ళీ జల్సా, భలేదొంగలు చిత్రాల ద్వారా మళ్లీ తనేమిటో నిరూపించింది. ఈ చిత్రాల తర్వాత ఇలియానా యే చిత్రాన్ని ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంది. దాంతో ఆమెపై రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇలియానా డిమాండ్ చేసే పారితోషికానికి భయపడే నిర్మాతలు ఆమె అంటే ఇంట్రెస్ట్ చూపడం లేదని సౌత్ లో అందరూ చెప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇలియానా మళ్ళీ ఒక్కసారిగా తెలుగులో మూడు, తమిళంలో ఒక చిత్రం ఒప్పుకుని అందరి నోళ్ళూ మూయించింది. తెలుగులో వై.వి.యస్ చౌదిరి సినిమా, రవితేజ..సురేంద్రరెడ్డి సినిమా, నిర్మాత బి.వి.యస్.యన్.ప్రసాద్ సినిమాలు ఒప్పుకుంది. ఇక తమిళంలో విక్రమ్ సరసన కె.యస్.రవికుమార్ దర్శకత్వలో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిట. అంటే ఈ యేడాదంతా ఆమె బిజీ. వీటిల్లో యేది పెద్ద హిట్టయినా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలియానే హాట్ ప్లేస్ లో ఉంటుంది. దటీజ్ ఇలియానా స్టాటజీ...


Click it and Unblock the Notifications











