twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఠాగూర్' హాస్పటిల్ సీన్.... దర్శక,నిర్మాతలకు లీగల్ నోటీసు

    By Srikanya
    |

    ముంబై: చిరంజీవి ...ఠాగూర్ చిత్రంలోని ...చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి డబ్బులు దండుకునే సీన్ కు ఎంత స్పందన వచ్చిందే తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఎవర్ నెస్ వచ్చార కూడా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట అలాంటి సీను నిజ జీవితంలో జరుగుతూనే ఉంది. అది ప్రక్కన పెడితే అంతలా ప్రజాదరణ పొంది, మనస్సులో నిలిచిపోయిన ఈ సన్నివేసం ఇప్పుడు వివాదాలకు మూలంగా మారింది.

    ఈ సీన్ తో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి లీగల్ నోటీసు పంపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయించింది. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో వైద్యవృత్తిని కించపరిచేలా చూపించారని, పవిత్రమైన వైద్య వృత్తిపై ప్రజలకు నమ్మకం పోయేలా సన్నివేశాలున్నాయని ఐఎంఏ తెలిపింది. అక్షయ్, భన్సాలీకి మంగళవారం లీగలు నోటీసు ఇస్తామని ఐఎంఏ గౌరవ కార్యదర్శి డాక్టర్ కేకే అగర్వాల్ తెలిపారు.

    మెడికల్ ప్రొఫెషన్ దేవాలయం లాంటదని... రాజకీయాలు, పోలీసులు ఇతర వృత్తులకు భిన్నమైనదని పేర్కొన్నారు. ఇలాంటి వృత్తి గురించి సినిమాలో చూపించాలనుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. వైద్యవృత్తిని కించపరిచేలా ఉన్న దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా 'గబ్బర్' సినిమా చాలా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కితాబిచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    IMA to serve legal notice to makers of 'Gabbar is Back'

    అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా నటించిన 'గబ్బర్' సినిమా మే 1న విడుదల అయ్యింది. తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ, వయకోమ్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. 2002లో తమిళంలో వచ్చిన 'రమణ' సినిమా (తెలుగులో ఠాగూర్ )కు ఇది రీమేక్.

    తన విధ్యార్ధులతో కలిసి లంచం తీసుకుంటున్న వాళ్ళని మట్టికరిపిస్తూ వుండే ఉపాధ్యాయపాత్రలో హీరో కనిపిస్తాడు. ఈ పాత్రకోసం చాలా రోజులుగా అక్షయ్ కష్టపడ్డాడు. క్రిష్ కి ఇది పెద్ద ప్రొజెక్ట్. ఇప్పటివరకూ క్రిష్ ‘గమ్యం', ‘వేదం', ‘కృష్ణంవందే జగద్గురుం' సినిమాలు తీశాడు. స్టార్ల విషయం, బడ్జెట్ విషయం లెక్కిస్తే క్రిష్ కు ఇదే పెద్ద ప్రొజెక్ట్ కానుంది.

    ఇక ‘గబ్బర్' సినిమాలో సుమన్ విలన్ గా కనిపించనున్నాడు. సుమన్ తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గురించి మాట్లాడుతూ ‘ ‘శివాజీ' సినిమా చూసిన తర్వాత అక్షయ్ కుమార్ తన ఎత్తుకి, పర్సనాలిటీకి నేనైతే బాగుంటానని అక్షయ్ చెప్పడంతో క్రిష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ పాత్రలో నేను బాగుంటానని ‘గబ్బర్' మూవీకి సెలక్ట్ చేసారని' సుమన్ అన్నాడు.

    మరో ప్రక్క నేపాల్ బాధితుల కోసం 'గబ్బర్' సినిమా మొదటి రోజు కలెక్షన్లు విరాళంగా ఇవ్వనున్నట్టు వచ్చిన వదంతులను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తోసిపుచ్చాడు. దీని గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి నిర్ణయాలు నిర్మాత తీసుకోవాల్సి ఉంటుందని, ఈ సినిమాకు తాను నిర్మాతను కాదని అన్నాడు. తాను సహాయం చేయాలనుకుంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడబోనని ట్విటర్ లో పేర్కొన్నాడు. నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేయాలనుకునే వారికోసం ఏర్పాటు చేసిన ఫేస్ బుక్ లింకును తన ట్విటర్ లో పెట్టాడు.

    English summary
    The Indian Medical Association (IMA), an umbrella body of doctors practising modern medicine, has decided to serve a legal notice to Gabbar is Back actor Akshay Kumar and producer Sanjay Leela Bhansali for portraying the medical profession in poor light.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X