»   » సెక్సీ కరీనా 60 ఏళ్ల వయసులో ఎలా ఉంటుందో?

సెక్సీ కరీనా 60 ఏళ్ల వయసులో ఎలా ఉంటుందో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రముఖ సినీ మేగజైన్ 'ఫిల్మ్ ఫేర్' కవర్ పేజీపై ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు కనిపించింది. అంతే కాకుండా ఆమె ఇప్పటి వరకు 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఫిల్మ్ ఫేర్ బ్రాండ్‌తో నా అనుబంధం అప్పుడే అయిపోలేదని, 60 ఏళ్ల వయసులోనూ కూడా కవర్ పేజీపై కనిపించాలని ఉందని కరీనా వ్యాఖ్యానించారు.

తాజాగా విడుదలైన ఫిల్మ్ ఫేర్ లేటెస్ట్ వెర్షన్‌పై కూడా కరీనా దర్శనం ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆమె చేతుల మీదుగా మేగజైన్ విడుదల చేయించారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ 'ఫిల్మ్ ఫేర్ టీం మొత్తానికి కృతజ్ఞతలు. కవర్ పేజీపై రావడం ఇది 20వ సారి. మరిన్ని సార్లు నేను కవర్ పేజీ పైకి రావాలని కోరుకుంటున్నాను' అని వ్యాఖ్యానించారు.

Kareena Kapoor

తాజా ఫిల్మ్ ఫేర్ మేగజైన్లో రొటీన్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్, ఇంటర్వ్యూలే మాత్రమే కాకుండా....ఫ్యాషన్, లైప్ స్టైల్, లగ్జరీ అంశాలను కూడా చేర్చారు. ఈ మేగజైన్‌ ఎప్పటికప్పు సరికొత్తగా ముస్తాబవుతుండటంపై కరీనా ప్రశంసించారు. ఇలాంటి మేగజైన్ కవర్ పేజీపై తాను మరిన్ని సార్లు రావాలని కోరుకుంటున్నా. 60 ఏళ్ల వయసులోనూ రావాలనేదే నా కోరిక' అని వెల్లడించారు.

32 ఏళ్ల కరీనా ఇపుడు ఆకట్టుకునే రూపం, సెక్సీ సొగసులతో ప్రేక్షకులకు అభిమాన తారగా మారింది కరీనా. మరి 60 ఏళ్ల వయసులో ముడతలో ఉండే కరీనా ఎలా ఉంటుందో? ఇంతకీ అప్పటి వరకు అమ్మడు సినిమాల్లో కొనసాగుతుందా? అనేది కాలమే తేల్చాలి.

English summary
Bollywood actress Kareena Kapoor has featured on the cover of the Filmfare magazine almost 20 times, and she has also won six Filmfare awards - but she says that just association with the brand is never enough. She says she would like to be on the magazine cover even at 60 with her wrinkles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu