twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడుగురు నిర్మాతలు బాత్రూంలో దూరి పెద్ద హీరోయిన్‌ను పాడు చేశారు, చెప్పుతీసుకుని కొట్టింది!

    |

    ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి ఇప్పుడు మొదలైంది కాదని, సినిమా ఇండస్ట్రీ తొలి నాళ్ల నుంచి కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతూనే ఉన్నారని సినీ రంగానికి చెందిన పరిశోధకుడు ఇమంది రామారావు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

    ఇప్పటిలా ఆ కాలంలో సంఘాలు ఉండేవి కాదు. ఇష్టపడే వారు రాజీపడిపోయేవారు, ఇష్టం లేనివారు వెనకాల తిట్టుకునేవారు. ఇప్పటిలా వీధికెక్కి పరువుపీకి పందిరి వేసుకునేవారు కాదు. అది సర్వసాధారణం అనుకునేవారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోల హరాస్మెంటుకు అడ్జెస్ట్ అయ్యేవారని రామారావు తెలిపారు.

    ‘గ్రాటిట్యూడ్' అనే అందమైన పేరు పెట్టుకునే వారు

    ‘గ్రాటిట్యూడ్' అనే అందమైన పేరు పెట్టుకునే వారు

    అప్పట్లో ఏం జరిగినా బయటకు వచ్చేవి కాదు. దానికి ‘గ్రాటిట్యూడ్' అనే అందమైన పేరు పెట్టుకునే వారు. అంత పెద్ద హీరో నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు, ఈ ప్రొడ్యూసర్ వల్ల నాకు మంచి వేషం వచ్చింది, ఈ దర్శకుడి వల్ల నాకు ఈ స్థాయి వచ్చిందని ‘గ్రాటిట్యూడ్' చూపించుకునేవారని రామారావు గుర్తు చేసుకున్నారు.

    కానీ కాంచనమాల అలా చేయలేక పోయింది

    కానీ కాంచనమాల అలా చేయలేక పోయింది

    కానీ కాంచనమాల అలా చేయలేక పోయింది. అందగత్తె, స్వాభిమానం ఉన్న వ్యక్తి, ఆమెకు తులాభారం వేస్తానన్నా లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. జెమినీ వాసన్ వల్లే ఆమె జీవితం నాశనం అయిందని చాలా మంది అంటారు. బాలనాగమ్మ తర్వాత ఆమెతో చేసుకున్న సినీ అగ్రిమెంటను అడ్డుపెట్టుకుని ఆమె ఇతర సినిమాల్లో నటించకుండా చేశారు, ఆమె నటించిన ఓ సినిమా కూడా విడుదల కాకుండా అడ్డుకున్నాడని రామారావు తెలిపారు.

    అవి తట్టుకోలేక పిచ్చిది అయింది

    అవి తట్టుకోలేక పిచ్చిది అయింది

    చిన్నప్పటి నుంచి మాయలు, మోసాలు, కుట్రలు తెలియని సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆమె తన విషయంలో జరిగిన పరిణామాలు జీర్ణించుకోలేక పిచ్చిది అయిపోయింది. అప్పట్లో ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆమెకు సన్మానం చేశారు. అలా చేయడం వల్ల మళ్లీ మామూలు మనిషి అవుతుందని కొందరు భావించారు. కానీ ఎలాంటి లాభం లేక పోయిందని రామారావు గుర్తు చేసుకున్నారు.

    ఆ పెద్ద హీరోయిన్‌ను ఏడుగురు పాడు చేశారు

    ఆ పెద్ద హీరోయిన్‌ను ఏడుగురు పాడు చేశారు

    ఆ రోజుల్లో ఓ పెద్ద హీరోయిన్ బాత్రూంకు వెళ్లగానే ప్రొడ్యూసర్ సర్కిల్‌కు చెందిన ఏడుగురు అందులో దూరి ఆమె బయటకు రాకుండా పాడు చేసి వదిలేశారు. వారు చేసిన ఘాతుకాన్ని ఆమె బయటకు ఏమాత్రం చెప్పకుండా పెద్ద హీరోయిన్ అయిన తర్వాత ఒక్కొక్కడిని చెప్పుతీసికొట్టింది, వారికి ఇండస్ట్రీలో మంచి నీరు కూడా పుట్టకుండా చేసింది. కాళ్లు పట్టుకున్నా వినకుండా మీరు ఇండస్ట్రీలో ఉండటానికి తగరు, సర్వనాశనం అయిపోవాల్సిందే అని తరిమికొట్టింది, అదొక పద్దతి... కానీ కాంచన మాల అలా చేయలేక పోయిందని రామారావు వెల్లడించారు.

    శోభన్ బాబు కంటతడి పెట్టారు

    శోభన్ బాబు కంటతడి పెట్టారు

    కాంచనమాల అంటే శోభన్ బాబుకు చాలా అభిమానం. ఆమె పరిస్థితి చూసి చాలా బాధపడేవారు. ఆమె జీవితం ఇలా అయిందే అని కంటతడి పెట్టడం నేను స్వయంగా చూశాను అని రామారావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

    English summary
    Kanchanamala Chittajallu was an Indian film actress known for her works in Telugu cinema. She started her film career in Srikrishna Tulabharam, in a minor role as Mitravinda in 1935. The film was based on a play by Telugu cinema's first lyricist Chandala Kesava Dasu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X