బాధలో సూపర్ స్టార్.. మొదటి భార్య వద్దకు వెళ్లే పరిస్థితి కాదు, మహేష్ బాబు ఇల్లే బెటర్!

Recommended Video

Mahesh Babu To Take Care Of His Father Krishna || Filmibeat Telugu

ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ తన భార్య విజయ నిర్మల మరణించిన సమయంలో పసిపిల్లాడిలా ఏడవటం అందరినీ కలిచి వేసింది. ఇంతకాలం తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తన అర్ధాంగి ఇక లేరనే విషయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.

కృష్ణ, విజయ నిర్మల బంధాన్ని చాలా దగ్గర నుంచి పరిశీలించిన, సూపర్ స్టార్‌కు సన్నిహితుడైన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తాజా పరిణామాలపై స్పందిస్తూ... 'కృష్ణగారు అంతలా ఏడవటం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. వారు ఒకిపై ఒకరు ఎంతో ప్రేమతో ఉండేవారు, వారి శరీరాలు వేరైనా... ప్రాణం ఒకటే అనేలా ఉండేవారు. అందుకే ఆమె మరణాన్ని ఆయన తట్టుకోలేకపోయారు.' అన్నారు.

కృష్ణగారు అన్నింటి మీద ఆశ వదులుకున్నారు

కృష్ణగారు అన్నింటి మీద ఆశ వదులుకున్నారు

కృష్ణగారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయడం లేదు. ఆయన ఈ స్థితిలో ఎక్కువ దు::ఖపడకూడదు, ఆందోళన చెందకూడదు, ఎక్కువగా ఏడవకూడదు, విశ్రాంతి లేకుండా ఉండకూడదు. వేళ ప్రకారం ఆయన తీసుకోవాల్సినవి తీసుకోకుంటే ప్రాణాలకే ముప్పు. ఆ విషయం తెలిసి కూడా ఏడుస్తున్నారంటే ప్రాణం మీద ఆశ వదిలేశారనుకోవాలి... అని ఇమంది రామారావు వ్యాఖ్యానించారు.

మొదటి భార్య దగ్గర ఉండే పరిస్థితి లేదు

మొదటి భార్య దగ్గర ఉండే పరిస్థితి లేదు

కృష్ణగారి మొదటి భార్య ఉంది కదా, అక్కడికి వెళ్లిపోవచ్చుకదా అని కొందరు అనొచ్చు... కానీ ఇందిరా దేవిగారు కృష్ణగారిని చూసుకునే పరిస్థితులో లేరు. ఆమెనే ఇంకొకరు చూసుకోవాలి. భాధలో ఉన్న కృష్ణగారు ఆ ఆవేదనలో నుంచి గట్టెక్కే మార్గం మహేష్ బాబు వద్దకు వెళ్లడమే అన్నారు.

అక్కడ ఉంటేనే కుదుటపడే అవకాశం ఉంది

అక్కడ ఉంటేనే కుదుటపడే అవకాశం ఉంది

కృష్ణకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మహేష్ బాబు. ఆయన తన తండ్రి పేరు నిలబెట్టి, కృష్ణకు మంచి పేరు తీసుకొచ్చారు. ఏ తండ్రికైనా తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉంటే కొంత తృప్తి ఉంటుంది. మహేష్ బాబు పిల్లలతో గడపటం ద్వారా ఆయన కొంత కుదుట పడే అవకాశం ఉంది. అందుకే కృష్ణగారు ఉండగలిగే చోటు మహేష్ బాబు ఇల్లు మాత్రమే. నమ్రత-మహేష్ బాబు పిల్లల ముద్దు మాటలు, అల్లరి చేష్టలు కృష్ణగారిని కుదుట పడేలా చేసే అవకాశం ఉంది... అని రామారావు అభిప్రాయ పడ్డారు.

కృష్ణ-విజయ నిర్మల

కృష్ణ-విజయ నిర్మల

కృష్ణ-విజయ నిర్మల తొలిసారి 1967లో ‘సాక్షి' అనే చిత్రంలో కలసి నటించారు. ఈ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా విడుదలైన రెండేళ్లకు ఇద్దరూ 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇటు వ్యక్తిగత జీవితానికి, అటు సినిమా జీవితానికి సంబంధించి ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో 50 ఏళ్లకుపైగా అన్యోన్య దాంపత్యం సాగించారు. ఇంతకాలం తనను కంటికి రెప్పలా చూసుకున్న అర్దాంగి లేరనే విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ తట్టుకోలేక పోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X