»   » మోస్ట్ గుడ్ లుకింగ్...మహేష్ బాబు నెం.6

మోస్ట్ గుడ్ లుకింగ్...మహేష్ బాబు నెం.6

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మన తెలుగు హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు అందగాడు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్(IMDB)సంస్థ తయారు చేసిన ఇండియన్ గుడ్ లుకింగ్ యాక్టర్ల జాబితాలో మహేష్ బాబుకు 6వ స్థానం దక్కింది. మొదటి స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండగా టాప్ 25లో తెలుగు నుంచి మహష్ బాబు 6వ స్థానం, నాగార్జునకు 21వ స్థానం దక్కింది. కాగా ఈ జాబితాలో హృతిక్ 3వ స్థానంలో, అమితాబ్ 9వ స్థానంలో, జాన్ అబ్రహం 17వ స్థానంలో, అమీర్ ఖాన్ 22 స్థానంలో ఉన్నారు.

అయితే ఈ జాబితా ఇప్పుడు తయారైంది కాదు. అప్పుడెప్పుడో 2011లో దీన్ని విడుదల చేసారు. అయితే తాజాగా మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ ఈ వార్త మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగే ఇందుకు కారణమని స్పష్టం అవుతోంది.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో 1(నేనొక్కడినే) చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే లండన్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో మరో షెడ్యూల్ బ్యాంకాక్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్.స

ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు శ్రీను వైట్ల దర్వకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటించబోతున్నాడు. అక్టోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

English summary

 IMDB the world’s most popular and authoritative source for movie, TV and celebrity content has released 25 Most Good Looking Leading Actors in INDIA. In this Prince Mahesh Babu stands No.6 followed by Nagarjuna on 21st position.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu