IMDB Rating Vakeel Saab: మోస్ట్ పాపులర్ మూవీగా హిస్టరీ.. ఆ ఇద్దరిలో పవన్ కల్యాణ్ టాప్

హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన వకీల్ సాబ్ చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రిలీజైన ఈ చిత్రం ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే వకీల్ సాబ్‌కు ప్రముఖ సినీ రేటింగ్ సంస్థ IMDB ప్రశంసలతో ముంచెత్తింది. ఆ వివరాల్లోకి వెళితే..

కరోనావైరస్ ప్రతికూల పరిస్థితుల్లో

కరోనావైరస్ ప్రతికూల పరిస్థితుల్లో

టాలీవుడ్‌లో రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో ముందుకొచ్చారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ చిత్రం అత్యంత ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్నది. ఏపీ, తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ పరంగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ ఆకట్టుకొన్నారు.

100 కోట్లకుపైగా

100 కోట్లకుపైగా

వకీల్ సాబ్ అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా 89.35 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 121.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, రూ.78.77 కోట్ల రూపాయల నికర కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. నైజాంలో 25 కోట్లుకుపైగా, ఆంధ్రాలో రూ.50 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించింది.

IMDB టాప్ రేటింగ్

IMDB టాప్ రేటింగ్

IMDB ఫిలిం రేటింగ్ సంస్థ ఇండియన్ ఫిల్మ్స్ అండ్ టీవీ షోలకు సంబంధించిన 2021లో ఆరు నెలల నివేదికను వెల్లడిస్తూ వకీల్ సాబ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. హిందీలో పింక్, తమిళంలో నెర్కొండ పార్వాయి చిత్రాల్లో కంటే వకీల్ సాబ్ అత్యంత పాపులారిటీని సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ నిలిచింది అని ఐఎమ్‌డీబీ తన నివేదికలో పేర్కొన్నది.

గత ఆరు నెలల్లో రిలీజైన చిత్రాలు

గత ఆరు నెలల్లో రిలీజైన చిత్రాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో 2021 సంవత్సరంలో అంటే.. గత ఆరు నెలల్లో దాదాపు 30 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో వకీల్ సాబ్ చిత్రం అన్ని రకాలుగా టాప్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రిలీజైన చిత్రాల్లో పాపులారిటీని సాధించింది అని తన నివేదికలో ఐఎమ్‌డీబీ వెల్లడించింది.

Recommended Video

Sarileru Neekevvaru & Ala Vaikunthapuramulo Both Will be Hit. Here's Why
పవన్ కల్యాణ్ మూవీస్ ఇలా..

పవన్ కల్యాణ్ మూవీస్ ఇలా..

ఇక పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత మలయాళంలో మంచి విజయం అందుకొన్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఇంకా రెండు చిత్రాలు అంగీకరించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి అయ్యప్పనుమ్ కోషియం సినిమాను పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకొన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X