twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    IMDB's Top 10 movies తెలుగు, కన్నడ సినిమాల హవా.. RRR, కేజీఎఫ్2, విక్రమ్‌కు ఎన్నో స్థానమంటే?

    |

    భారతీయ సినిమాలు, సినీ ప్రముఖులు, వినోద రంగానికి సంబంధించిన రేటింగ్‌ను నిర్దారించే IMDB 2022 లో అత్యధిక మంది సినీ ప్రేక్షకులను ఆకర్షించిన చిత్రాల జాబితాను వెల్లడించింది. IMDB‌ అనుసరించిన నెటిజన్లు, సినీ అభిమానుల స్పందన ఆధారంగా టాప్ 10 సినిమాల జాబితాను వెల్లడించింది. 200 మిలియన్ల కంటే ఎక్కువగా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారి రెస్పాన్స్‌ను బట్టి ఈ జాబితాను పొందుపరిచింది. ఈ టాప్ జాబితాలో చోటు దక్కిన సినిమాలు ఏమిటంటే?

     RRR టాప్ 1 స్థానంలో

    RRR టాప్ 1 స్థానంలో

    2022 సంవత్సరంలో IMDB‌ టాప్ రేటింగ్‌ సాధించిన చిత్రాల్లో RRR చిత్రం నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా రెస్పాన్స్‌ను సంపాదించింది. ఈ సినిమా సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 175.47 మిలియన్ డాలర్లు అంటే.. 1200 కోట్ల రూపాయలను రాబట్టింది.

    ది కశ్మీర్ ఫైల్స్ రెండో స్థానంలో

    ది కశ్మీర్ ఫైల్స్ రెండో స్థానంలో

    IMDB‌ టాప్ రేటింగ్‌ సాధించిన రెండో చిత్రంగా వివాదాస్పద ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం నిలిచింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. 1990లో కశ్మీర్‌లో కాశ్మీర్ పండితులపై జరిగిన దాడుల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం సుమారు 25 కోట్లతో రూపొందింది. అయితే 2022లో భారీ విజయాన్ని అందుకొన్న ఈ సినిమా సుమారు 340 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.

    కేజీఎఫ్ 2 మూడో స్థానంలో

    కేజీఎఫ్ 2 మూడో స్థానంలో

    IMDB‌ టాప్ రేటింగ్‌ జాబితాలో నిలిచిన మూడో చిత్రం కేజీఎఫ్: చాప్టర్ 2. యష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన కేజీఎఫ్: చాఫ్టర్ 1 చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందింది. ఈ చిత్రాన్ని 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో హోంబలే ఫిలింస్ రూపొందించగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ ఏడాది అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

    విక్రమ్ రేటింగ్స్‌లోను, కలెక్షన్లలోను

    విక్రమ్ రేటింగ్స్‌లోను, కలెక్షన్లలోను

    2002 సంవత్సరంలో IMDB‌ టాప్ రేటింగ్‌ జాబితాలో నాలుగో చిత్రంగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం ఘనతను సాధించింది. సాధారణ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనూహ్యమైన విజయాన్ని అందుకొన్నది. విజయ్ సేతుపతి, సూర్య అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. కరోనా తర్వాత భారీ వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డుకెక్కింది.

    కంతార సంచలనం రేపి

    కంతార సంచలనం రేపి

    ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంతారా చిత్రం భారీ విజయాన్ని సాధించిIMDB‌ టాప్ రేటింగ్‌ జాబితాలో 5వ స్థానాన్ని సొంతం చేసుకొన్నది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించి, నటించిన ఈ చిత్రాన్ని 16 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 405 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. క్రిటిక్స్, సినీ అభిమానుల నుంచి అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది.

    రాకెట్రీ: ది నంబియార్ ఎఫెక్ట్

    రాకెట్రీ: ది నంబియార్ ఎఫెక్ట్

    ఇస్రోలో విశిష్టమైన సైంటిస్టుగా పేరున్న నంబీ నారాయణ్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ: ది నంబియార్ ఎఫెక్ట్ అనే పేరుతో సినిమాను నటుడు మాధవన్ నిర్మించారు. ఈ సినిమాకు సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకుల నుంచి భారీగా రేటింగ్ వచ్చింది. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడం తెలిసిందే. 2002 సంవత్సరంలో IMDB‌ టాప్ రేటింగ్‌ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.

    మేజర్ మూవీకి ఎన్నో స్థానం అంటే

    మేజర్ మూవీకి ఎన్నో స్థానం అంటే


    ముంబైలో పాకిస్థాన్ ముష్కరులు సాగించిన 26/11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన మేజర్ చిత్రంలో అడివి శేష్ టైటిల్ రోల్‌లో కనిపించాడు. తాజ్ హోటల్‌లో చొరబడిన పాక్ ఉగ్రవాదులను ఎదురించిన ఈ కథ దేశవ్యాప్తంగా సినీ క్రిటిక్స్, ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నది. మేజర్ సినిమాను 32 కోట్లతో నిర్మించగా.. 70 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా IMDB‌ టాప్ రేటింగ్‌‌ను సొంతం చేసుకోవడమే కాకుండా 2022లో 7 స్థానంలో నిలిచింది.

    సీతారామం

    సీతారామం


    హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ జంటగా రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన తెలుగు చిత్రం సీతారామం. ఈ సినిమా తెలుగులో భారీ విజయం అందుకోగా.. ఆ తర్వాత హిందీ, ఇతర భాషల్లో డబ్బింగ్ చేశారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్పందన వ్యక్తమైంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన లవ్ స్టోరిని భారతీయ ప్రేక్షకులు అద్బుతంగా ఆదరించారు. సీతారామం చిత్రాన్ని 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా.. ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకుపైగా వసూళ్లను నమోదుచేసింది.

    పొన్నియన్ సెల్వన్: పార్ట్ వన్

    పొన్నియన్ సెల్వన్: పార్ట్ వన్


    దేశంలోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు ఉన్న మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ తదితరులు నటించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని అందుకొన్నది. అయితే దేశవ్యాప్తంగా క్రిటిక్స్, ఆడియెన్స్‌ నుంచి ఐఎండీబీలో మంచి రెస్పాన్స్ అందుకొని.. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాను 250 కోట్లతో తెరకెక్కించగా.. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

    చార్లీ 777

    చార్లీ 777


    2022 సంవత్సరంలో కన్నడ పరిశ్రమ భారీ విజయాలను అందుకొన్నది. కేజీఎఫ్ 2, విక్రాంత్ రోనా తర్వాత ఆ రేంజ్‌లో విజయం అందుకొన్న సినిమా 777 చార్లీ. రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకొన్నది. 20 కోట్లతో రూపొందిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా IMDB‌ టాప్ రేటింగ్‌ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.

    English summary
    Popular Rating Webstie IMDB is declared Its Top 10 Indian movies in 2022. RRR, The Kashmir Files, KGF2 tops in its list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X