మహేష్ బాబుతో హాలీవుడ్ హీరోయిన్!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్, పర్సనాలిటీతో ఉంటాడనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి మహేష్ బాబు సరసన హాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య మహేష్ బాబు హీరోగా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని నిర్మించి, సూపర్ హిట్ కొట్టిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ మళ్లీ ఆయనతో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకీ సరసన అంజలి నటిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెతో నిర్మిస్తున్నారు. ఈరోజే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అక్టోబర్ 10 నుండి గోవాలో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. 2013 వేసవికి ఈ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











