రాఖీ సావంత్ 'నపుంసక' వ్యాఖ్యపై ధర్నా..అరెస్టుకు డిమాండ్
ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండటానికి ఇష్టపడే బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ ఈ సారి పెద్ద తలనొప్పిలోనే ఇరుక్కుంది. ఆమె నిర్వహించిన రాఖీకా ఇన్సాఫ్ రియాలిటీ షోలో పాల్గొన్న లక్ష్మణ్ అనే వ్యక్తిని రాఖీ సావంత్ నామర్ద్ గా (నపుంసకుడు) అభివర్ణించింది. దాంతో అతడు తిండీతిప్పలు మానేసి, నవంబర్ 11న ఝాన్సీ వైద్య కళాశాల ఆస్పత్రిలో మరణించాడు. తన కొడుకు మరణానికి రాఖీనే కారణమని, ఆమెను కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్ తల్లి సావిత్రి అహిర్వాల్ డిమాండు చేస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో కొద్దిరోజుల క్రితం మొదలైంది. ఈ వివాదం పెరిగి జనం నిన్న(ఆదివారం) వీధులకెక్కి మరీ ఆమెను అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇక ఈ వార్త నేపాల్ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కింది. రాఖీని అరెస్టు చేయాలంటూ మృతుడి స్వస్థలమైన ముజాఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. మరో ప్రక్క లోకల్ పోలీస్ స్టేషన్ లో రాఖీకి వ్యతిరేకంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయ్యింది. రాఖీ మాత్రం ఈ విషయంపై ఏమీ కామెంట్ చేయలేదు.


Click it and Unblock the Notifications











