టాక్సీ డ్రైవర్ నిజాయితీపై రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ఓ ట్వీట్ చేసారు. ఆయన తన భార్య రమా రాజమౌళితో కలిసి బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఆమె పర్స్ ని మర్చిపోవటం జరిగింది. అది గమనించిన ఓ టాక్సీ డ్రైవర్ దాన్ని తీసుకుని అందులోని ఐడి కార్డ్ లో ఉన్న మేనేజర్ నెంబర్ కి ఫోన్ చేసాడు. రాజమౌళి స్టే చేసిన హోటల్ ఎడ్రస్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ పర్స్ తీసుకుని దాదాపు అరవై కిలోమీటర్లు ప్రయాణించి ఆ పర్స్ ని అందచేసాడు. ఆ డ్రైవర్ పేరు నౌషద్. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ లో రాసుకున్నారు. ఆ డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్నారు.
ఇతరుల డబ్బుకు ఆశపడే ఈ రోజుల్లో నిజాయితీగా ఉండే నౌషద్ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. అందుకే నాకు ఈ దేశమంటే ఇష్టమని ట్వీట్ చేసాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి తన ఈగ చిత్రానికి నగిషీలు చెక్కుతున్నారు. ఆ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. నాని,సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ చిత్రం బిజెనెస్ వర్గాల్లో అప్పుడే మంచి క్రేజ్ క్రియోట్ చేసింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా ఓ చిత్రం రూపొందించటానికి రాజమౌళి రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











