సినిమాలను పైరసీ చేసే యంగ్ హీరో
సినిమాలను పైరసీ చేసి అమ్మటం నేరం..అలాగే సినిమా వాళ్ళకు పైరసీ చేసేవాళ్లంటే మహా మంట. అయితే ఇప్పుడు అదే పైరసీ పాయింట్ చుట్టూ కథ అల్లేసి బాలీవుడ్ ఓ సినిమా తీయటానికి రెడీ అయిపోతోంది. 'మిలన్ టాకీస్'అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ తాజా చిత్రాన్ని నిర్మించబోతోంది. 'పాన్ సింగ్ తోమార్' దర్శకుడు తిగ్మాన్షు ధులియా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకున్నారు.
మొదట ఈ కథను ప్రతీక్ బబ్బర్‌కి వినిపించారు. ఆయనే హీరోగా నటిస్తారని ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల ఆయన నటించిన 'ఏక్ దీవానా థా' విడుదలై నిరాశ మిగిల్చింది. దీంతో దర్శకుడు ఇమ్రాన్ ఖాన్‌ని సంప్రదించి కథ వినిపించినట్లు తెలిసింది. ఆయన కూడా పచ్చజెండా ఊపారట. ఉత్తర భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో నివసించే యువకుడి కథ ఇది. బాలీవుడ్‌లో వచ్చే విజయవంతమైన సినిమాల్ని పైరసీ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అతని చుట్టూనే సినిమా తిరుగుతుంది. 'పాన్ సింగ్ తోమార్' విడుదలవగానే 'మిలన్ టాకీస్'ను మొదలుపెడతారని సమాచారం. మొత్తానికి పైరసీ కూడా సనీ వస్తువు అయ్యిందన్నమాట.


Click it and Unblock the Notifications











