For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్లాన్ రివర్స్ ..ఓపెన్ లెటర్ తో అనుష్క

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఒక్కోసారి ఏదో అనుకుని మాట్లాడితే దాని పర్యవసానం మరొకటి ఉంటుంది. హీరోయిన్స్ అన్నాక ప్రచార కార్యక్రమాల్లోనూ... టీవీ షోల్లోనూ పాల్గొనడం సహజం. అందులో మాట్లాడే మాటలు ఒక్కోసారి పెద్ద దుమారాన్నే రేపుతాయి. కనిపించే తీరుకూడా దుమారం రేపుతుందా అంటే అనుష్క శర్మ పరిస్థితి చూస్తే నిజమే అనిపిస్తోంది. సినిమా పబ్లిసిటీ కోసం మొదలెట్టిన విషయం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకోసం పెద్ద లేఖే రాయాల్సి వచ్చింది.

  అనుష్క శర్మ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొంది. అందులో ఆమె పెదవుల్ని చూసినవాళ్లు అనుష్క పెదవులకు ఏదో శస్త్రచికిత్స చేయించుకుంది అంటూ ప్రచారాన్ని లేవదీశారు. దానికి తోడు ఆమె 'నా న్యూ లుక్ ఎలా ఉంది? నా పెదాల గురించి మాట్లాడండి..ఎలా ఉన్నాయో చెప్పండి' అంటూ.....ట్విట్టర్లో ఓ కామెంట్ విసిరింది. దీంతో చాలా మంది అభిమానులు తమ తమ అభిప్రాయాలు వెల్లడిచారు. నీ పెదాలు సహజంగా లేవని కొందరు, ప్లాస్టిక్ సర్జరీ తర్వాత నీ లిప్స్ అందంగా లేవని మరికొందరు కామెంట్స్ చేసారు.  మొదట పబ్లిసిటీ వస్తుందని భావించిన ఆమె తర్వాత దాని రూపం మారటంతో కంగారుపడి నివావరణ చర్యలు మొదలెట్టింది. రూమర్స్ ని ఖండించింది. అయినా తగ్గలేదు. దీంతో ఆమె ట్విట్టర్‌లో వారిపై దాడి చేసింది. ఆ వదంతులు ఆగకపోయేసరికి కంగారు పడి ఈ విషయమై పెద్ద లేఖే రాసింది.

  ''నా రాబోయే సినిమా 'బాంబే వెల్వెట్‌'లో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. 60వ దశకంనాటి గాయనిగా కనిపిస్తాను. అందుకే దానికి తగ్గట్టుగా నా అలంకరణలో మార్పులు చేసుకుంటున్నాను. అందులో భాగంగానే నా పెదవుల్ని మేకప్‌ మెలకువలతో మార్చుకున్నాను. అంతేగానీ ఏ శస్త్రచికిత్స చేయించుకోలేదు. రేపు ఎప్పుడైనా నా కాళ్లు మరింత అందంగా కనిపిస్తే.. వాటికి కూడా శస్త్రచికిత్స చేయించుకున్నా అని పుట్టిస్తారా'' అంటూ పేర్కొంది అనుష్క.

  మరో ప్రక్క విరాట్‌కోహ్లీతో అనుష్క శర్మ క్లోజ్‌గా ఉంటూ ఇంగ్లండ్ వీధుల్లో తిరుగుతూ రెడ్‌హ్యాండెండ్‌గా కెమెరాకు చిక్కింది. రణ్‌వీర్‌సింగ్‌తో బ్రేకప్ అయిన తరువాత అనుష్కశర్మ మళ్లీ విరాట్‌తో డేటింగ్ చేస్తోంది. ఈమెకు బాలీవుడ్‌లో ఉన్న ఇమేజ్, అవకాశాల దృష్ట్యా, కోహ్లీకి పెరుగుతున్న రేంజ్ దృష్ట్యా ఈ డేటింగ్ అవీ అవసరమే కావచ్చునని బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

  English summary
  Anushka Sharma the sobriquet of 'joker lips'. Tweeples wondered if it was a lip job or if she has been accidently hit by the bat of alleged boyfriend Virat Kohli. The speculation began after the teasers for Karan Johar's show first appeared on TV and has not ended even days after the show was aired.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more