‘అవతార్’లో పాటలు లేవు కదా? ఇ.సత్తిబాబు
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించడంతోపాటు..తెలుగులోనూ ఘన విజయం సాధించిన 'అవతార్"లో పాటలు లేవు కదా? పైగా ఇప్పుడు..బాగున్న పాటల్ని రింగ్‌టోన్స్‌గా, కాలర్‌ట్యూన్స్‌గా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకునే వీలుండడంతో ఆడియో క్యాసెట్స్, సీడీలు ఎవరు కొనడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే అంటున్నారు దర్శకుడు ఇ.సత్తిబాబు. ఆయన ప్రస్తుతం బెట్టింగ్ బంగార్రాజు చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.ఆ చిత్రంలో నాలుగు పాటలే ఉన్నాయి. ఆ విషయంపై మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
ఇక సత్తిబాబు గురువు ఇవివి సత్యనారాయణ ఒక్క పాట కూడా లేకుండానే గతంలో 'కితకితలు" చిత్రాన్ని తీసి ఘన విజయం స్వంతం చేసుకున్నారు. ఇవివి తన చిత్రాల్లో క్రమంగా పాటల్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. 2008లో సంచలన విజయం సాధించిన 'బెండు అప్పారావు, ఆర్.ఎం.పి" చిత్రానికి దర్శకత్వం వహించిన ఇవివి..ఆ చిత్రంలో నాలుగు పాటలే పెట్టారు. ఇవివి దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న 'బురిడి"(తెగ నవ్వించేత్తాడు) సినిమా కూడా నాలుగు పాటలకే పరిమితమవుతుండడం విశేషం.


Click it and Unblock the Notifications











