»   » బాహుబలి-2: రాజమౌళి చెప్పిన ఆసక్తికర విషయాలు

బాహుబలి-2: రాజమౌళి చెప్పిన ఆసక్తికర విషయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 63వ జాతీయ ఫిల్మ్ అవార్డులను రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిమందే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి స్పెషల్ ఎఫ్టెక్స్ కేటగిరీలోనూ అవార్డు దక్కింది. ఈ నేపధ్యంలో బాహుబలి దర్శకుడు రాజమౌళి సినిమా గురించి తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సినిమా చిత్రీకరణలోని అనుభవాలను, బాహుబలి 2లో ఏం చూపించబోతున్నారు, హైలెట్ అయ్యే సీన్స్ ఏవి తదితర అంశాల మీద స్పందించారు. దీంతో పాటు మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు కూడా ఆసక్తికరంగా సమాధానం చెప్పారు రాజమౌళి.

కరణ్ జోహార్ గురించి కూడా రాజమౌళి ఇంట్రెస్టింగ్‌గా వ్యాఖ్యానించారు. ఆయన వల్లే బాహుబలి ఇంత పెద్ద సినిమాగా పేరు తెచ్చుకుంది అని తెలిపారు.

రాజమౌళి చెప్పిన విశేషాలు స్లైడ్ షోలో...

మొత్తం ఐదు గంటల సినిమా

మొత్తం ఐదు గంటల సినిమా

సాధారణంగా ఓ సినిమాను రెండు.. రెండున్నర గంటలు తీస్తాం. కానీ బాహుబలి కథ పెద్దది కావడం వల్ల నాలుగున్నర ఐదు గంటలకు చేరింది. అందుకే సినిమాను రెండు భాగాలు తెస్తున్నాం అన్నారు రాజమౌళి.

బాహుబలి 2లోనే అసలు కథ

బాహుబలి 2లోనే అసలు కథ

‘బాహుబలి'లో పాత్రల పరిచయానికి రెండు రెండున్నర గంటలు తీసుకున్నాం. అసలు కథ బాహుబలి-2లోనే ఉంటుందన్నారు రాజమౌళి.

హైలెట్

హైలెట్

విజువల్ ఎఫెక్టులు.. యుద్ధ సన్నివేశాలు తొలి భాగానికి ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటాయి. ఐతే వాటి కంటే కూడా ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్లే రెండో భాగానికి హైలెట్ గా నిలుస్తాయని రాజమౌళి తెలిపారు.

రెండో భాగంలో

రెండో భాగంలో

బాహుబలి, శివగామి, దేవసేన, భల్లాలదేవ పాత్రల మధ్య జరిగిన అసలు స్టోరీ పార్ట్ 2 లో ఉంటుందని రాజమౌళి తెలిపారు.

 బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు

బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు

ఈ ప్రశ్నకు కూడా రెండో భాగంలో సమాధానం చెబుతాం, నేను చెప్పా కాబట్టి చంపాడు... నేను అలా ఎందుకు చెప్పానో బాహుబలి 2లో తెలుస్తుంది అన్నారు.

అతిపెద్ద సవాల్

అతిపెద్ద సవాల్

బాహుబలి షూటింగ్ మొత్తం 380 రోజులు జరిగింది. ఐతే 320-330 రోజులకు వచ్చేసరికి యూనిట్ సభ్యులందరినీ ఒకరకమైన నిరుత్సాహం ఆవరించింది. అందరిలోనూ అలసట కనిపించింది. యూనిట్ సభ్యుల్లో ఆ ఫీలింగ్ పోగొట్టడం ఓ సవాల్ గా తీసుకున్నాను. నాకు నేను ఎనర్జీ తెచ్చుకున్నాను, మిగతా వాళ్లకు కూడా ఎనర్జీ ఇచ్చాను అన్నారు రాజమౌళి.

కరణ్ జోమార్ గురించి

కరణ్ జోమార్ గురించి

‘ఈ సినిమాకు కరణ్ జోహార్ భాగస్వామి కావడం రానా వల్లే జరిగింది. అతనే ఈ ప్రాజెక్టును ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు. మాకు బాహుబలి మీద చాలా నమ్మకముంది. మా దగ్గర క్వాలిటీ ప్రాడెక్ట్ ఉందని తెలుసు. కానీ అది సరైన వ్యక్తి చేతిలో పడితేనే మంచి స్థాయికి వెళ్తుందని అనుకున్నాం. అలాంటి సమయంలోనే కరణ్ మాకు తోడయ్యాడు. ఏ వ్యాపారమైనా భాగస్వాముల్లో ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. బాహుబలి విషయంలో అదే జరిగింది అన్నారు.

భిన్నంగా..

భిన్నంగా..

సినిమాల విషయాలో ఆయన ఆలోచనలు.. నా ఆలోచనలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఐతే సినిమా పట్ల మా ఇద్దరికీ ఒకే రకమైన ప్రేమ ఉందని మాత్రం ఆయనతో మాట్లాడాక అర్థమైంది అన్నారు రాజమౌళి.

భయంతో..

భయంతో..

ప్రభాస్ తమన్నాను అందుకోవడానికి నీళ్లల్లోకి దూకే సన్నివేశానికి చాలా కష్టపడ్డాం. ప్రభాస్ భుజానికి సర్జరీ చేయించుకున్నాక తీసిన సన్నివేశం అది. అందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రభాస్ కు ఏమవుతుందో అన్న భయం మధ్య ఆ షాట్ తీశాం అన్నారు రాజమౌళి.

శోభు గురించి

శోభు గురించి

బాహుబలి యూనిట్లో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరని అడగ్గా....ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డే నా ఫేవరెట్. ఆయన ఈ సినిమాకు ఎంత కష్టపడ్డారో చెప్పలేను. నా కోడైరెక్టర్ ఆయనే. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అతనే అన్నాడు.

శ్రీవల్లి

శ్రీవల్లి

లైన్ ప్రొడ్యూసర్ శ్రీ వల్లి సెట్‌కు అందరికంటే ముందుగా వచ్చేవారు. వేలమందితో సజావుగా షూటింగ్ చేయగలిగామంటే ఆమే కారణమని చెప్పాడు రాజమౌళి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu