డేటింగ్ రూమర్స్ వస్తున్నాయని ఆ బంధాన్ని వదులుకోలేను.. సీక్రెట్స్ చెప్పిన సాయిధరమ్ తేజ్

Recommended Video

Sai Dharam Tej Reveals His College Love Story

సినీ పరిశ్రమ అన్నాక రూమర్స్ కామన్. హీరోహీరోయిన్లపై ఎన్నో రకాలుగా వార్తలు వస్తుంటాయి. అయితే వాటన్నింటికీ అందరు సెలెబ్రిటీలు రెస్పాండ్ అయ్యే సందర్భాలు తక్కువ. కానీ తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, తనపై వస్తున్న రూమర్స్, పెళ్లి వార్తలపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆయన చెప్పిన సంగతులేంటో చూద్దామా..

కాలేజ్‌ ప్రేమకథ.. చివరకు

కాలేజ్‌ ప్రేమకథ.. చివరకు

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిధరమ్ తేజ్ తన కాలేజ్‌ ప్రేమకథను వెల్లడించాడు. తాను కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని, ఆమె కూడా తనను ఇష్టపడిందని సాయిధరమ్‌ చెప్పాడు. కాలేజ్‌లో ఉన్నంత వరకు ప్రేమాయణం బాగానే సాగిందట. కానీ ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెరగటంతో ఆమెతో సాయిధరమ్ పెద్దగా టచ్‌లో లేకవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారట.

హీరోయిన్స్‌తో డేటింగ్‌.. సాయిధరమ్ తేజ్ రియాక్షన్

హీరోయిన్స్‌తో డేటింగ్‌.. సాయిధరమ్ తేజ్ రియాక్షన్

ఇక హీరోయిన్లతో తాను డేటింగ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించాడు సాయిధరమ్ తేజ్. తనకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లతో మంచి అనుబంధం ఉందని, అందువల్లే తనపై రూమర్స్ ఎక్కువగా పుట్టుకొచ్చాయని ఆయన చెప్పారు. అయితే ఇలాంటి రూమర్స్ కారణంగా తనకున్న మంచి ఫ్రెండ్స్‌తో బంధాన్ని తెంచుకోలేనని సాయిధరమ్ తేజ్ స్పష్టం చేశాడు.

టైమ్ తీసుకొని అప్పుడే పెళ్లి చేసుకుంటా

టైమ్ తీసుకొని అప్పుడే పెళ్లి చేసుకుంటా

తాను ఇండస్ట్రీలో ఇంకా బాగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని సాయిధరమ్ తేజ్ అన్నాడు. కాకపోతే తనకు ఇంట్లోవాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆయన చెప్పాడు. ఇండస్ట్రీలో సరిగ్గా సెట్ అయ్యానని అనిపించినపుడే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు ఈ మెగా మేనల్లుడు.

 సాయిధరమ్ తేజ్ ‘ప్రతి రోజూ పండగే'

సాయిధరమ్ తేజ్ ‘ప్రతి రోజూ పండగే'

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘ప్రతి రోజూ పండగే'. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X