నటిగా నేను సాధించాల్సింది చాలా ఉందంటున్న హీరోయిన్..!
చాలా కాలం గ్యాపు తర్వాత ఎం.ఎస్.రాజు ఓ చిత్రాన్ని నిర్నించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇటీవల కాలంలో వరుస ప్లాప్ లతో బాధపడుతున్న ఎం.ఎస్.రాజు కి మంచి స్క్రిప్టు దోరకడంతో సినిమానితెరకెక్కించే ప్రయత్నంలో పడ్డారు. నాయికగా రాణించాలంటే వాణిజ్యపరమైన చిత్రాల్లో నటించడం. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ అభినయానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు అనే సంగతి తెలిసినా నటించడానికి ఓకే అంటారు. ఇలాంటి సినిమాలు చెన్నై చిన్నది త్రిష చాలా చేసింది. ఇప్పుడు ఈ అమ్మడి చూపు నటన వైపు మళ్శింది. దానికి కారణం ఇటీనల ఈ అమ్మడు ప్రపంచ కధానాయకుడు కమల్ హాసన్ తో నటించింది. ఆ టైంలో కమల్ కొంచెం ఈమెను నటనవైపు వెళ్లమని ప్రేరేపించారంట. దానితో ఈ అమ్మడి చూపు నటన వైపు మళ్శింది. తెలుగులో నటనకు త్రిషకు మంచి మార్కులే సంపాదించిన అరుంధతిలాంటి సినిమాల్లో నటించాలనే కోరిక తీరలేదని తెగ బాధపడిపోతోంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఎం.ఎస్.రాజు త్వరలో తెరకెక్కిస్తున్న సినిమాలో త్రిష ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పాత్ర దోరికిందని సమాచారం. ఆయన ఇదివరకు నిర్మించిన వర్షం, నువ్వోస్తానంటే నేనోద్దంటానా, పౌర్ణమి లాంటి చిత్రాల్లో త్రిష నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టారో సరసన ఒ సినిమాలో నటించడానికి ఈ చెన్నై చిన్నది ఒప్పుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











