ఈ సంవత్సరం మెగా హీరోల మేటరేంటో తేలిపోనుందా...!?
మెగా కుటుంబానికి 2010 అస్సలు కలిసి రాలేదు. ఈ ఏడాదిలో విడుదలైన మెగా మూవీలు నాలుగూ ప్లాపయ్యాయి. ఇంకా చెప్పాలంటే మగధీర తర్వాత వచ్చిన మెగా హీరోల సినిమా ఏదీ సక్సెస్ కాలేదు. 2010 చాలా డిజప్పాయింట్ చేసిందని రామ్ చరణ్ కూడా ఒప్పేసుకున్నాడు. వచ్చే ఏడాది ఇలా కాకుండా బెటర్ గా ఉండేలా చూసుకుంటానని అభిమానులకి మాటిచ్చాడు. 2011పై మెగా అభిమానుల ఆశలు పెరిగేలా చాలా తక్కువ వ్యవధిలో మూడు సినిమాలు విడుదల కానున్నాయి.
పవన్ కళ్యాణ్ 'లవ్లీ", అల్లు అర్జున్'బద్రీనాథ్", రామ్ చరణ్ 'మెరుపు" చిత్రాలు ఏప్రిల్ నుంచి జూలై లోగా విడుదల కానున్నాయి. ఈ మూడు చిత్రాలూ కూడా ఆయా హీరోల బలాలకి తగ్గట్టు రూపొందుతోన్నవి కావడంతో వీటిపై ఫాన్స్ అంచనాలు బాగా పెట్టుకున్నారు. 'లవ్లీ"తో పవన్ కళ్యాణ్ తనకి కలిసి వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ జోనర్ లోకి తిరిగి వెళుతున్నాడు. చరణ్ కూడా ఇంతదాకా మాస్ హీరోగా మంచి మార్కులు వేయించుకోవడంతో 'మెరుపు" మినిమం గ్యారెంటీ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.
ఇక అల్లు అర్జున్ 'బద్రీనాథ్" తో భారీ బడ్జెట్ హీరోగా అవతరిస్తున్నాడు. తెలుగు సినిమా బిజినెస్ స్టామినా చాటిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని బద్రీనాథ్ గురించి చిత్ర సీమలో చెబుతున్నారు. ఈ మూడు సినిమాలతో మెగా హీరోల మేటరేంటో, అసలు వారికిపుడు సినీ రంగంలోఉన్న స్థానంమేంటో తేలిపోతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











