twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే ప్రైవేట్‌గా చైతూతో పెళ్లి.. సాయి పల్లవికి ఆ విషయం చెప్పా.. సమంత

    నాగచైతన్య, సమంతల వివాహంఈ నెల 6 న గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువమంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్ళి తర్వాత ఈ జంట మీడియాకి దూరంగానే ఉంది.

    |

    Recommended Video

    "I Really Appriciate Her Talent In That Movie" Samantha Says

    నాగచైతన్య, సమంతల వివాహంఈ నెల 6న గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువమంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్ళి తర్వాత ఈ జంట మీడియాకి దూరంగానే ఉంది. పెళ్ళి సంబరాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ జీవితం లో మదుర క్షణాలని మిస్ అవకుండా మీడియాకీ, వార్తలకీ దూరంగానే ఉన్నారు ఈ కొత్త జంట. పెళ్ళికి కొన్ని రోజులముందు ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతా ఇలా తన ఆనందాన్నీ, తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించీ కొన్ని విషయాలని చెప్పింది.

     ఈ పెళ్లి కేవలం సంప్రదాయం కోసమే

    ఈ పెళ్లి కేవలం సంప్రదాయం కోసమే

    నిజానికి మా పెళ్ళి మానసికంగా ఎప్పుడో అయిపోయింది, ఈ పెళ్లి కేవలం సంప్రదాయం కోసం చేసుకుంటున్నాం. నా వివాహం ఓ ప్రైవేటు వేడుకగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగాలని ఎప్పుడో అనుకున్నా. ఒక సెలబ్రిటీ పెళ్ళిలా హడావుడిగా జరిగిపోవటం నాకిష్టం లేదు.

    ఎలా ఫీలవుతున్నారో కూడా తెలియదు

    ఎలా ఫీలవుతున్నారో కూడా తెలియదు

    కావాల్సిన వారు ఆనందంగా ఉండేలా చూసుకోవడం నాకు, చైకు చాలా ముఖ్యం. పెళ్లి వైభవంగా నిర్వహిస్తే వచ్చిన అతిథులు ఆ సమయంలో ఎలా ఫీలవుతున్నారో కూడా తెలియదు. వాళ్ళని పట్టించుకోవటమూ, మమ్మల్ని మేము పట్టించుకోవటమూ కుదరదు...

    రోజూ పనిచేస్తున్నా

    రోజూ పనిచేస్తున్నా

    ‘అక్టోబరు 2 వరకు నా సినిమా షూటింగ్‌, డబ్బింగ్‌ పనుల్లోనే ఉన్నా. ఇక పెళ్లి కోసం గోవా వెళ్లాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ నా లక్ష్యాలు తగ్గుతూ వస్తాయనుకున్నా. కానీ అలా జరగడం లేదు. విజయవంతమైన సినిమాతో కెరీర్‌ ప్రారంభమై ఈ స్థాయికి చేరడం.. ఇది నేను వూహించిన దాని కన్నా చాలా ఎక్కువ. ఏదో ఒక రోజు సినిమాలకు దూరంగా ఉంటాననుకున్నా.. కానీ, అది జరగలేదు. ఇది బ్యాంక్‌ బ్యాలెన్స్‌ గురించి కాదు. ఇంకా బాగా, ఉత్తమంగా నటించాలి అనుకున్నా. ఆ భావన నాకు ఇంత వరకు కలగలేదు. దాన్ని చేరుకునే దిశగా రోజూ పనిచేస్తున్నా.

    ఇప్పుడు నాతో నేనే పరుగులు తీస్తున్నా

    ఇప్పుడు నాతో నేనే పరుగులు తీస్తున్నా

    ‘గతంలోనే ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో ఎందుకు పాలుపంచుకోలేదు, సినిమాలపైనే పూర్తి దృష్టి ఎందుకు పెట్టాను? అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. సమాజంలో మనం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. నిజాయతీగా చెబుతున్నా, ఇప్పుడు నాతో నేనే పరుగులు తీస్తున్నా.

     ఒక్క నెల విరామం తీసుకున్నా

    ఒక్క నెల విరామం తీసుకున్నా

    ఈ 24 గంటల్లోనే చాలా చేయాలి అనుకుంటా. సరదాగా ఎలా సమయాన్ని గడపాలో నాకు తెలియదని నా స్నేహితులు ఎప్పుడూ ఆటపట్టిస్తుంటారు.నా పరంగా సరదాగా ఉండటం అంటే.. కష్టపడి పనిచేయడమే. గత ఏడాది ‘జనతా గ్యారేజ్‌' విడుదల తర్వాత ఒక్క నెల విరామం తీసుకున్నా. ఆ సమయంలో నా బిజినెస్‌ ప్లాన్స్‌ను అమలు చేయడం ప్రారంభించా. అప్పటి నుంచి ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, మరో పక్క ఆ పనులు చూసుకుంటున్నా'.

    అందరికీ చెప్పా

    అందరికీ చెప్పా

    నా చుట్టూ ఉన్న అందరి ప్రతిభ నాకు ప్రేరణ ఇస్తుంటుంది. ఈ విషయంలో నేను చాలా వాస్తవికంగా ఆలోచిస్తా, ఎదుటి వ్యక్తి ప్రతిభను ప్రశంసిస్తుంటా. ‘ఫిదా' సినిమా చూసిన తర్వాత సాయిపల్లవి నటనను అభినందించా. ఆమె నటించిన ఏ సినిమా అయినా చూడొచ్చని అందరికీ చెప్పా.

    నిరంతరం ప్రయత్నిస్తుంటా

    నిరంతరం ప్రయత్నిస్తుంటా

    పక్కవారు ఎంత బాగా నటిస్తున్నారో తెలుసుకున్న తర్వాత నేనూ నా నటనని నిరంతరం ఉత్తమంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటా. సినిమా సెట్స్‌లో షూటింగ్‌ విరామ సమయం చాలా ఉంటుంది. ఈ సమయంలో ఆ పాత్రను చక్కగా చేయడానికి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా.

    నాగార్జున తో

    నాగార్జున తో

    ఇక నాగార్జున తో కలిసి చేస్తున్న రాజు గారి గది గురించి కూడా ఇలా చెప్పింది సమంతా ‘నేను చిన్న పాత్రలో నటించా. కానీ ఆ పాత్ర సినిమా కథకు చాలా ముఖ్యం. సినిమా చూసినప్పుడు ఎందుకో ఆ విషయం అర్థమవుతుంది. ప్రతీ అమ్మాయి ఈ పాత్రకు కనెక్ట్‌ అవుతుంది. చిన్న పాత్రలో నటించకూడదనే పరిమితులు నాకేమీ లేవు. కొన్నిసార్లు సినిమా మొత్తం మనమే ఉంటాం. కానీ ఎందుకు అందులో నటించామో తెలియదు. ఒక్కోసారి అతిథి పాత్రలో చేసినా, మంచి పేరు వస్తుంది. ఈ సినిమా షూటింగ్‌, తెరపైకి దాన్ని తీసుకొచ్చిన విధానంతో నేను సంతృప్తిగా ఉన్నా'.

    అట్లీ నాకు ప్రియమైన స్నేహితుడు

    అట్లీ నాకు ప్రియమైన స్నేహితుడు

    మెర్సల్‌ (తెలుగులో "అదిరింది") చిత్రం యూనిట్‌ నాకు కుటుంబంతో సమానం. అట్లీ నాకు ప్రియమైన స్నేహితుడు. ఈ సినిమాలో నటించనని ఎవరూ చెప్పరు. అట్లీ సినిమాల్ని అర్థం చేసుకునే విధానం, దాన్ని తెరపైకి తెచ్చే తీరు చాలా గొప్పగా ఉంటాయి. తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద స్టార్‌గా ఉన్న విజయ్‌.. అట్లీతో ‘తెరి'తర్వాత మళ్లీ సినిమా తీయడానికి ఒప్పుకోవడానికి కారణం ఇదే. అట్లీలో ఓ మ్యాజిక్‌ ఉంది. నిత్యామేనన్‌, కాజల్‌తో కలిసి పనిచేశా. వాళ్లిద్దరు చాలా మంచి వ్యక్తులు. నటనపరంగా చాలా బాగా పరిణతి చెందారు. ‘మెర్సల్‌' పెద్ద సినిమా కాబోతోంది'.

    నటనా పరంగా పేరు తెచ్చేవే

    నటనా పరంగా పేరు తెచ్చేవే

    ఇక హీరోయిన్ గా తాను చేయాలనుకుంటున్న పాత్రల గురించి కూడా తనకున్న అభిప్రాయాన్నీ, తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో కూడా చెప్పింది సమంతా ‘కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలా ఉన్నాయి. ‘బాహుబలి 2'లో అనుష్క, ‘నిన్ను కోరి'లో నివేదా థామస్‌, ‘ఫిదా'లో సాయిపల్లవి, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం'లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పాత్రలు నటనకు ప్రాధాన్యం ఉన్నవే. కథానాయికలు మరిన్ని మంచి చిత్రాలు చేసేందుకు వీలుగా దర్శకులు ఉత్తమమైన పాత్రలు రాయాలని కోరుతున్నా' అంటూ చెప్పింది. సో ఇకముందు కూడా తాను నటించ బోతున్నాననీ, అవీ నటనా పరంగా పేరు తెచ్చేవే తప్ప గ్లామర్ పాత్రలు కావనీ ఇండైరెక్ట్ గా చెప్పేసినట్టే అనుకోవాలా?

    English summary
    "In our heads, we were already married" Samantha Ruth on her fairytale wedding to Naga Chaitanya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X