అవినీతి పరుడితో ఐశ్వర్య రాయ్-వివాదం(ఫోటోలు)
ముంబై : సెలబ్రిటీలు అన్న తర్వాత వారి చుట్టూ తరచూ వివాదాలు ముసురుకోవడం సహజమే. అందాల సుందరి ఐశ్వర్యరాయ్ కూడా అందుకు అతీరాలేమీ కాదు. తాజాగా ఐశ్వర్యరాయ్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్న మాజీ మంత్రి సురేష్ సల్మాడీతో కలిసి ఐశ్వర్యరాయ్ పాల్గొనడమే ఈ వివాదానికి కారణం.
ఇటీవల పూణెలో ఓ జ్యువెల్లరీ స్టోర్ ఓపెనింగుకు ఐశ్వర్యరాయ్ హాజరైంది. నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్‌తో పాటు మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీని కూడా అరెస్టు చేసారు. సురేష్ కల్మాడీ గతంలో కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా భారీ ఎత్తున అవినీతి కార్యకలాపాలకు పాల్పడటంతో సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. దాదాపు 10 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు.
అయితే అవినీతి పరుడైన సురేష్ కల్మాడీతో కలిసి పాల్గొనడం ఏమిటని కొందరు విమర్శిస్తున్నారు. అతనితో కలిసి రిబ్బన్ కట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సురేష్ కల్మాడీ ఈ కార్యక్రమానికి వస్తున్న విషయం ఐష్‌కు తెలిసి వచ్చిందో? తెలియక వచ్చిందో? కానీ ఇదో వివాదంగా మారింది.

పుణెలో జరిగిన ఓ జ్యువెల్లరీ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళంకిత మాజీ మంత్రి సురేష్ కల్మాడీతో కలిసి రిబ్బన్ కట్టింగ్ చేస్తున్న ఐశ్వర్యరాయ్. ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్‌తో పాటు సురేష్ కల్మాడీని కూడా ఆహ్వానించారు.

కల్యాణ్ జ్యువెల్లరీ సంస్థ పూణెలో ఓ కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో లోకల్‌గా పొలిటికల్ పవర్ ఉన్న సురేష్ కల్మాడీని కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే ఈ విషయం ఐశ్వర్యరాయ్‌కి తెలుసో? తెలయదో?

తమ అభిమాన అందాల తార ఐశ్వర్యరాయ్ అవినీతి కుంభకోణానికి పాల్పడిన ఓ కళంకిత మంత్రితో కలిసి ఇలాంటి వాణిజ్య ప్రకటన కార్యక్రమంలో పాల్గొనడాన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఐశ్వర్యరాయ్ కల్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఐశ్వర్యరాయ్‌తో ఆమె మామయ్య, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

పూణెలో కొత్తగా ఏర్పాటయిన షోరూంతో కళ్యాణ్ జ్యువెల్లర్స్ షోరూంల సంఖ్య 50కి చేరుకుంది. సురేష్ కల్మాడీ గతంలో కామన్ వెల్త్ గేమ్స్ నిర్మాహణకు నేతృత్వ బాధ్యతలు చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారు. సిబీఐ అతన్ని అరెస్టు చేసింది. పది నెలల పాటు సురేష్ కల్మాడీ జైల్లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











