హాట్ హీరోయిన్ నజ్రియా ఎంగేజ్మెంట్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: మళయాల హీరోయిన్ నజ్రియా నజీమ్....గురించి మీకు పరిచయం ఉండే ఉంటుంది. అమ్మడు తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించక పోయినా, ఎన్టీఆర్ తాజా మూవీ 'రభస'లో నటించబోతోందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అంతేకాక తమిళంలో ధనుష్‌తో నటించిన ఓ సినిమాలో బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసి వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయంలో హీరోయిన్ నయనతార, నజ్రియా మధ్య మాటల యుద్దం జరిగింది.

ఆ సంగతి పక్కన పెడితే నజ్రియా ఎంగేజ్మెంట్ మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్‌‌తో ఆదివారం తిరువనంతపురంలో జరిగింది. ఈ వేడుకకు మళయాల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహం ఈ సంవత్సరం ఆగస్టు 21న జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆసక్తికర విషయం ఏమిటంటే....నజ్రియా, ఫహాద్ కలిసి అంజలి మీనన్ దర్శకత్వంలో ఓ మళయాల చిత్రంలో నటించబోతున్నారు. ఆ చిత్రం పేరు 'ఎల్ ఫర్ లవ్'. సో....పెళ్లి ముందు సినిమాలో ఇద్దరూ రొమాన్స్ చేసుకునే అవకాశం వచ్చిందన్నమాట. ఈ చిత్రంలో నత్యా మీనన్, నవీన్ పౌలీ, ఇషా తల్వార్ తదితరులు నటించారు.

నజియా, ఫహాద్ ఫాజిల్

నజియా, ఫహాద్ ఫాజిల్


మాలీవుడ్ నటులు ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ఎంగేజ్మెంట్ ఆదివారం తిరువనంతపురంలో జరిగింది.

నజ్రియాకు అలంకరణ

నజ్రియాకు అలంకరణ


ఎంగేజ్మెంట్ వేడుకను పురస్కరించుకుని నజ్రియాను అలంకరిస్తున్న దృశ్యం.

ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఫహాద్ పాజిల్

ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఫహాద్ పాజిల్


ఎంగేజ్మెంట్ వేడుకకు సిద్ధమవుతున్న నటుడు ఫహాద్ ఫాజిల్. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో ఫహాద్ ఫాజిల్ కలిసి ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

వేదిక వద్దకు వస్తూ..

వేదిక వద్దకు వస్తూ..


ఎంగేజ్మెంట్ వేడుక వేధిక వద్దకు కలిసి వస్తున్న ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్

ఎంగేజ్మెంట్ ఫంక్షన్

ఎంగేజ్మెంట్ ఫంక్షన్


ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతున్న దృశ్యం.

ఇకపై ప్రేమలో...

ఇకపై ప్రేమలో...


ఎంగేజ్మెంట్ జరుగడం అంటే సగం పెళ్లయినట్లే. వీరిది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ప్రేమ వ్యవహారం నడిపిస్తారేమో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X