డైరెక్టర్లతో యాక్టర్ల గొడవలు (ఫోటో ఫీచర్)
ముంబై: కాంట్రవర్సీలు, చిన్నచిన్న గొడవలు సినిమా పరిశ్రమలో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇక బాలీవుడ్ లాంటి భారీ పరిశ్రమల్లో ఇలాంటివి సర్వ సాధారణం. ముఖ్యంగా డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్ల మధ్య గొడవలు వస్తే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ దర్శకుడు సాజిద్ ఖాన్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది. సాజిద్ ఖాన్ తో పని చేసి చాలా పెద్ద తప్పు చేసానని, మరోసారి అతని దర్శకత్వంలో చేయనని తేల్చిచెప్పాడు.
ఇటీవల విడుదలైన 'హమ్ షకల్స్' అనే సినిమా విడుదల తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని చెత్త సినిమాలకంటే చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడిపై సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు అతని భార్య కరీనా కూడా మద్దతు పలికింది. సినిమాపై అభిప్రాయం తెలిపే హక్కు ప్రతి ఒక్క యాక్టర్ కు ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే మరో యాక్టర్ అజయ్ దేవగన్ అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. సినిమా బాక్సాఫీసు వద్ద పెయిలైతే...నటీనటుల బాధ్యత కూడా ఉంటుంది. మొత్తం దర్శకుడిపైనే నెట్టేయడం సరికాదు అని అంటున్నారు. గతంలో సాజిద్ ఖాన్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ చేసిన 'హిమ్మత్ వాలా' చిత్రం భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఇలా దర్శకుడికి, నటీనటులకు మధ్య విబేధాలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. స్లైడ్ షోలో అలాంటి కాంట్రవర్సీలకు సంబంధించిన వివరాలు.

కరీనా కపూర్-కరణ్ జోహార్
హీరోయిన్ కరీనా కపూర్, దర్శకుడు కరణ్ జోహార్ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే కరణ్ జోహార్ నిర్మించిన ‘కల్ నో న హో' అనే చిత్రం నుండి కరీనా కపూర్ తప్పుకుంది. ఈ చిత్రానికి కరీనా కపూర్ తన మార్కెట్ రేటు కంటే ఎక్కువ డిమాండ్ చేయడంతో అంత మొత్తం ఇవ్వడానికి కరణ్ జోహార్ ఇష్ట పడలేదు. దీంతో కరీనా స్థానంలో ప్రీతీ జింతాను తీసుకున్నారు. ఈ చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు.

సల్మాన్ ఖాన్-అనీజ్ బజ్మీ
రెడీ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, ఆ చిత్ర దర్శకుడు అనీజ్ అజ్మీ మధ్య చిన్నపాటి గొడవజరిగింది. సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు వార్తలు వచ్చాయి.

అమీర్ ఖాన్-అమోల్ గుప్తా
‘తేరే జమీన్ పర్' చిత్రం విషయంలో అమీర్ ఖాన్, అమోల్ గుప్తా మధ్య విబేధాలు వచ్చాయి. సినిమా దర్శకత్వం చేయడం ఆపేయాలని, మిగిలినది తానే చేసుకుంటానని అమీర్ ఖాన్ అడిగారట. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేయలేదు.

అజయ్ దేవగన్, అనుభవ్ సిన్హా
‘క్యాష్' సినిమా సమయంలో అజయ్ దేవగన్, దర్శకుడు అనుభవ్ సిన్హాపై కోపంగా ఉన్నారట. ఆ సమయంలో అనుభవ్ సిన్హా శిల్పా శెట్టితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో అనుభవ్ శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టిన సినిమాలో తీసుకోవాలని ట్రై చేసాడు. ఈ పరిణామాలు అజయ్ దేవగన్ కు నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కరీనా కపూర్-మాధుర్ బండార్కర్
‘హీరోయిన్' సినిమా సమయంలో స్క్రిప్టు మార్పు చేయడంతో మాధుర్ బండార్కర్, కరీనా కపూర్ మధ్య విబేధాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











