»   » ఫోటోలు : ఓ ఊపు ఊపిన సెక్సీ వాన పాటలు

ఫోటోలు : ఓ ఊపు ఊపిన సెక్సీ వాన పాటలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వర్షా కాలం అనగానే సినీ ప్రియులకు ముందుగా గుర్తొచ్చేవి సెక్సీ వాన పాటలే. సినిమాల్లో వాన పాటలకు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. తడిసిన అందాలతో హీరోయిన్లు ఆడి పాడుతుంటే...తెగ ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ వాన పాటల జోరు ఈ నాటి కాదు. ఎన్టీ రామారావు కాలం నుంచే ఈ వాన పాటలకు భలే గిరాకీ ఏర్పడింది. ఇప్పుడంటే చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కానీ.. అప్పట్లో దాదాపు ప్రతి సినిమాలోనూ వాన పాటలు ఉండేవి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం కొందరు దర్శకులు ప్రత్యేకించి ఇలాంటి పాటలను పెట్టించే వారు.

అయితే ఈ పాటలను చిత్రీకరించడం అంత ఈజీ ఏం కాదు. చిత్రీకరించేటప్పుడు దర్శకులు, పాట చిత్రీకరణ తర్వాత తారలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారు. మరి అన్ని కష్టాలు పడితే తప్ప తెరపైకి రొమాంటిక్ రెయిన్ సాంగ్ వచ్చేది కాదు. శృంగార రసం ఒలికించడానికి పాట చిత్రీకరణలో తడిసి ముద్దయిన నాయికలు...అప్పడప్పుడు జారి పడే వారట. నీళ్లలో చాలా సేపు తడవటం వల్ల జ్వరాజలు, జలుబులు వచ్చేవి వారికి. ఇక నీళ్లు శుభ్రంగా లేకుంటే దురదలు, ఇన్ఫెక్షన్లు సరేసరి. తొలి నాళ్లలో ఇలాంటి చాలా ఉండేవి.


ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ‘వేటగాడు' చిత్రంలో ‘ఆకుచాటు పిందె తడిసె' పాట అప్పట్లో బాగా పాపులర్ అయింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈచిత్ర విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది.


సీనియర్ నటుడు నాగేశ్వరరావు, బి. సరోజా దేవి జంటా రూపొందిన ‘ఆత్మబలం' చిత్రంలోని ‘చిటపట చినుకులు' పాట అప్పల్లో సినీ ప్రియులను ఊపేసింది.


ఇద్దరూ అసాధ్యులే చిత్రంలో కృష్ణ-గీతా మధ్య చిత్రీకరించిన ‘చినుకు చినుకు' సాంగ్ అప్పట్లో అందరినీ అలరించింది.

చిరంజీవి-విజయశాంతి కలిసి ‘గ్యాంగ్ లీడర్' చిత్రంలో చేసిన ‘వాన వాన వెల్లు వాయే' పాట అప్పట్లో థియేటర్లు షేక్ చేసింది.


బాలకృష్ణ-దివ్య భారతి కలిసి ధర్మక్షేత్రం చిత్రంలో ‘ముద్దులతో'సాంగుకు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.


క్షణ క్షణం చిత్రంలో వెంకటేష్, శ్రీదేవి కలిసి ‘అమ్మాయి ముద్దు ఇవ్వందే' సాంగులో కలిసి నటించారు. అప్పట్లో ఈ సాంగుకు హాట్ సాంగుగా పేరు తెచ్చుకుంది.


నాగార్జున, నగ్మ కలిసి నటించిన ‘అల్లరి అల్లుడు' చిత్రంలో ‘కమ్మని ఒడి బొమ్మని' సాంగుకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.


నాని సినిమాలో మహేష్ బాబు, రమ్యకృష్ణ ‘మార్కండేయ' అనే రేయిన్ సాంగులో నటించారు. అయితే ఈ సాంగు తెలుగు వెర్షన్లో విడుదల కాలేదు. తమిళ వెర్షన్ నానిలో ఈ సాంగును పొందు పరిచారు.


జూ ఎన్టీఆర్, ఆర్తి అగర్వాల్ అల్లరి రాముడు చిత్రంలో......‘రెండు వేల రెండు వరుకు' అనే వాన పాటలో స్టెప్పులేసారు. ఈ సాంగు బాగా పాపులర్ అయింది.


రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘రచ్చ' చిత్రంలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సాంగ్ ‘వాన వాన వెల్లువాయే' పాటను రీమక్స్ చేసారు. ఈ సాంగులో చరన్ సరసన తమన్నా రొమాన్స్ చేసింది.


రాజేష్ ఖన్నా, జీన్ అమన్ కలిసి చేసిన ‘బీగి బీగి రాథోంమె' అనే హిందీ సాంగ్ బాగా పాపులర్ అయింది.


చాందిని అనే హిందీ చిత్రంలో శ్రీదేవి చేసిన వాన పాట శృంగార ప్రియుల మది దోచింది.


మిస్టర్ ఇండియా అనే హిందీ చిత్రంలో శ్రీదేవి-అనిల్ కపూర్ కలిసి చేసిన వాన పాట అప్పట్లో ఓ సెన్సేషన్


షారుక్-మాధురి దీక్షిత్ దిల్ తో పాగల్ హై చిత్రంలో చేసిన ‘కోయి లడ్ కీ హై' పాట బాగా ఫేమస్ అయంది.


అమితాబ్-సుమితా పాటిల్ ‘నమక్ హలాల్' చిత్రంలో చేసిన వానపాటకు మంచి స్పందన వచ్చింది.


సర్ఫరోష్ చిత్రంలో అమీర్ ఖాన్-సోనాలి బింద్రే కలిసి చేసిన ‘జోహై దిల్ కా' సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


సైఫ్ అలీఖాన్-రాణి ముఖర్జీ ‘హమ్ తుమ్'చిత్రంలో చేసిన వాన పాటకు మంచి స్పందన వచ్చింది.


చమేలీ చిత్రంలో కరీనా కపూర్ వాన పాట ఆ చిత్రానికే హైలెట్


ఫనా చిత్రంలో అమీర్-కాజోల్ మధ్య చిత్రీకరించిన ‘దేఖోనా' సాంగుకు మంచి మార్కులు పడ్డాయి ప్రేక్షకుల నుండి

ఆ తర్వాత తరం దర్శకులు ఇలాంటి జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాన పాటల్లో వాళ్లు వేసే డ్రెస్సులను స్పెషల్ గా ఎంపిక చేస్తారు. హీరోయిన్ల బాడీలో ఏయే పార్టులు కనిపించాలో, ఏవేవి కినపించ కూడదో ముందు చెప్పి అలాంటి దుస్తులను కుట్టిస్తారట. ఇదంతా ఒక ఎత్తయితే....కృత్రిమంగా వర్షం ఎఫెక్టును తీసుకు రావడం మరో ఎత్తు. అందుకే ఇలాంటి పాట చిత్తీకరణ బాగా నీళ్లు అందుబాటులో ఉండే ప్రదేశాల్లోనే పెట్టుకుంటారు.

హైదరాబాద్ లాంటి నగరాల్లో నీళ్లు ఫ్రీగా అస్సలు దొరకవు. డబ్బులిచ్చి ట్యాంకర్లలో తెప్పించుకోవాలి. వేసవిలో ఇలాంటి సీన్ల చిత్రీకరణ అయితే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. నీళ్లు సమకూరాక పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నాజల్స్ బిగింస్తారు. ఈ నాజల్స్ వల్లనే వర్షం పడిన ఎఫెక్టు వస్తుంది. ఇన్ని కష్టాలు పడిన తర్వాత...తెరపై చిటపట చినుకులు రాలుతాయి. ఆ చినుకుల్లో అందాల గుమ్మలు తమ సొగసులను ఆరబోస్తూ ప్రేక్షకులకు విదోదాన్ని పంచుతారు.

English summary
Monsoon is considered as one of most romantic, enticing and mesmerizing season. It is the season for the lovers and romance. This lovely, sexy season also plays a very important role in the Tollywood movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu