ఫోటోలు: ఐశ్వర్య రాయ్, అమితాబ్ ముంబై వీధుల్లో డాన్స్
ముంబై: ముంబై వాసులకు ఇది చాలా చాలా అరుదైన అనుభవం. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముంబై వీధుల్లో డాన్స్ చేసిన దృశ్యమది. బచ్చన్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఫిల్మ్ మేకర్ షాద్ అలీ పెళ్లి ఊరేగింపు(భారత్) సందర్భంగా ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
షాద్ అలీ వివాహం స్టైలిస్ట్ ఆర్తి పాట్‌కర్‌తో ఇటీవలే జరిగింది. వీరు తమ పెళ్లి రిసెప్షన్‌కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా షాద్ అలీ పెళ్లి వేడుకు హాజరైన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఆ వేడుకలో డాన్స్ చేసారు. తొలుత అభిషేక్ డాన్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత తన వైఫ్ ఐశ్వర్యను కూడా డాన్స్ చేయాలంటూ లాగాడు, ఆ తర్వాత అమితాబ్ కూడా వారితో జాయిన్ అయి యమ జోరుగా స్టెప్పులు వేసారు.
ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. 'చాలా రోజుల గ్యాప్ తర్వాత ముంబై వీధుల్లో డాన్స్ చేసాను నా ఫ్రెండ్ షాద్ అలీ భారత్‌లో, ఎంతో ఆనందంగా ఉంది, షాద్ అలీ నాకెంతో సన్నిహితుడు' అంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసాడు. బిగ్ బి తన ట్విట్టర్లో ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ... 'షాద్ ఆలీ పెళ్లి వేడుకలో మా ఫ్యామిలీ మొత్తం పాల్గొని సందడి చేసాం... గ్రేట్ ఫన్' అంటూ ట్వీట్ చేసారు.
షాద్ అలీ పెళ్లి వేడుకలో... ఐశ్వర్య, అభిషేక్ పాల్గొన్న దృశ్యాలపై ఓ లుక్కేయండి.

షాద్ అలీ పెళ్లి వేడుకలో... ఐశ్వర్య, అభిషేక్ పాల్గొన్న దృశ్యాలు

Click it and Unblock the Notifications