పోటి ప్రపంచంలో అలాంటివి అన్ని మామూలే..!
తమన్నా ఈ పేరు ప్రస్తుతం కుర్ర కారు గుండెల్లో మారుమ్రోగుతుంది. ఈ ప్రస్తుతం తెలుగులో వివివినాయక్ దర్శకత్వంలో బద్రినాధ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరో కాగా, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్బంగా మాట్లాడుతూ సినిమాల్లో గ్లామర్ గా కనిపించినా, రియల్ లైఫ్ లో అలా కుదరదు అని అంటుంది. అంతేకాకుండా తాను చాలా సంప్రదాయకుంటుంబం నుంచి వచ్చానని, పెళ్శైన తర్వాత కూడా తాను సగటు భారతీయ వివాహిత ఎలా వుంటుందో నేను కూడా అలాగే ఉంటానని తన మనసులోని భావాలను వెల్లడించారు.
ఆ సమయంలో కోంత మంది అంటే ఇప్పుడు అలా ఉండడం లేదా అని అడగగా, అదేం లేదని సినిమా కోసం గ్లామర్ ప్రదర్శన తప్పడం లేదని, ఐనా తానేమి వల్గర్ గా తన అందాలను ప్రదర్శించడం లేదని చెప్పారు. మరి అల్లు అర్జున్ తో ఆ మధ్య హాట్ పోటో షూట్ గురించి అడగ్గా, పోటి ప్రపంచంలో ఇలాంటివి అన్ని మామూలే అని చమత్కరించింది. అంతేకాకుండా ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్శె చేసుకుంటానని, ప్రేమ మీద తనకి మంచి అభిప్రాయం లేదని తమన్నా తన అభిప్రాయాలను వెల్లడించడం జరిగినది.


Click it and Unblock the Notifications











