విజయ నిర్మల ఆస్తులపై అసందర్భ వార్తలు... మండి పడుతున్న ఫ్యాన్స్!
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఈ నెల 27న పరమపదించిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల మరణం సూపర్ స్టార్ కృష్ణతో పాటు తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టి వేసింది. తనతో పాటు 50 ఏళ్ల పాటు జీవిత ప్రయాణం చేసిన అర్దాంగి మరణాన్ని తట్టుకోలేక కృష్ణ కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది.
లేడీ డైరెక్టర్లలో లెజెండ్‌గా పేరు తెచ్చుకోవడంతో పాటు అత్యధికంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న విజయ నిర్మల ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఇలాంటి విషాద సమయంలో యూట్యూబ్‌లో దర్శనమిస్తున్న కొన్ని వార్తలపై అభిమానులు మండి పడుతున్నారు.

విషాదం మరువక ముందే ఏమిటీ వార్తలు
విజయ నిర్మల విషాదం నుంచి ఇంకా కుటుంబ సభ్యులు, అభిమానులు తేరుకోలేదు. ఈ సమయంలో యూట్యూబ్‌లో విజయ నిర్మల ఆస్తుల గరించి, అవి ఎవరికి దక్కుతాయి అనే అంశంపై పలు వార్తలు ప్రచారంలోకి రావడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది పూర్తిగా అసందర్భం
విజయ నిర్మల ఆస్తుల గురించి ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు కూడా ఆలోచించి ఉండరు. వారంతా ఆమె మరణించిన బాధలోనే ఉన్నారు. ఆమెకు ఉన్నది ఒకడే కొడుకు కాబట్టి ఇవి ఎవరికి చెందుతాయి అనే విషయంలో ఎలాంటి వివాదాలు సైతం ఉండబోవు. ఇలాంటి సమయంలో అసందర్భం వ్యాఖ్యానాలు అనవసరం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ విషయం నరేష్ చూసుకుంటారు
కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో.... విజయ నిర్మల ఆస్తులకు సంబంధించిన వీలునామాలో నరేష్ పేరు లేదని, ఆమె తన ఇద్దరు మనవళ్ల పేరుపై తన ఆస్తి రాసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలు నరేష్ చూసుకుంటారు, దీన్ని సోషల్ మీడియాలో అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఆస్తలపై ఇష్టం వచ్చినట్లు కథనాలు
విజయ నిర్మల పేరుపై నానక్‌రాంగూడలో ఇంటితో పాటు, ఫిల్మ్ నగర్లో ఇల్లు, చిలుకూరులో ఫాం హౌస్, 20 ఎకరాల పొలం. చెన్నైలో ఓ ఇల్లు ఉన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు విజయ నిర్మల సన్నిహితులు, అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











