రామ్ గోపాల్ వర్మ అతడి బంధువే: మళ్లీ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్
Recommended Video

తన తల్లిని తిట్టించి అత్యంత నీచానికి ఒడిగట్టారంటూ ఆగ్రహంతో ఊగి పోతున్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై మరింత సీరియస్‌గా ముందుకు సాగుతున్నారు. శుక్రవారం ఫిలిం ఛాంబర్ నుండి వెళ్లిపోయిన తర్వాత ఆయన మరోసారి వరుస ట్వీట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. తాజా ట్వీట్లలో శ్రీనిరాజు అనే వ్యక్తితో రామ్ గోపాల్ వర్మకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టీవీ9లో 88.69% షేర్లు
టీవీ9లో శ్రీనిరాజుకు 88.69% షేర్లు ఉన్నాయని వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. తన తల్లిని తిట్టించిన వ్యవహారంలో శ్రీనిరాజు, రవి ప్రకాష్, రామ్ గోపాల్ వర్మ, టీడీపీ హస్తం ఉందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.
వారి వివరాలతో సహా
ఎవరెవరికి ఎంత వాటాలు ఉన్నాయని వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అందుకు సంబంధించిన వివరాలు బయట పెట్టారు.
సిరీయస్‌గా పవన్ కళ్యాణ్ ట్వీట్స్
ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.
రామ్ గోపాల్ వర్మకు అతడు బంధువే
సత్యం రామలింగ రాజుకు శ్రీనిరాజు క్లోజ్ రిలేటివ్ అని, పరోక్షంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా శ్రీనిరాజు బంధువే అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











