IT Raids: దిల్ రాజు ఆఫీస్, నివాసంపై ఐటి మెరుపు దాడులు.. సంక్రాంతి కలెక్షనపై ఆరా !
Dil raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో సినీనటుల ఇళ్లపై ఐటీ శాఖ అధికారులు దాడి చేయడం సర్వసాధారణం అయింది. వరుసగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటులపై ఐటీ దాడులు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్‌రాజు ఆఫీస్, కుటుంబసభ్యుల ఇళ్లలో రైడ్స్ నిర్వహిస్తున్నాయి. దిల్‌రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇలా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా నగరంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా షాక్ అయింది. ఇటీవల దిల్ రాజు రెండు సినిమాలను నిర్మించారు. అందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్, మరోకటి వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు. ఈ సినిమాల కలెక్షన్స్ నేపథ్యంతో ఈ రైడ్స్ జరుగుతున్నట్టు టాక్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తూనే మరో వైపు డిస్టిబ్యూటర్ గాను వ్యవహరిస్తున్నారు. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజ్. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారారు. కాగా ఇటీవలే దిల్ రాజుని ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
అలాగే.. మెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి మూవీ మేకర్స్ పార్టనర్స్ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 వరల్డ్ వైడ్‌గా దాదాపు 1850 కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. అలాగే.. సింగర్ సునీత భర్త, మ్యాంగో మీడియా అధినేత రాము నివాసం పై కూడా ఐటీదాడి చేసినట్టు సమాచారం.

గతంలో లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. అలాగే క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై కూడా ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఐటీ అధికారులు కన్ను నిర్మాత దిల్ రాజు పై పడింది. ఆకస్మాత్తుగా ఇండస్ట్రీపై ఐటీ దాడులు చేయడంతో ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











