హాట్ హాట్ పాపలతో షారుఖ్-కేసు నమోదు
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పై కేరళలో కేసు నమోదైంది. ఇటీవల కొచ్చి వచ్చిన షారుఖ్ ఓ షోరూం ప్రారంభించడంతో పాటు, తన తాజా సినిమా 'డాన్-2' ప్రమోషన్ కూడా ఎంచక్కా కానిచ్చేశాడు. ఈ సందర్భంగా కసక్కుమనే హాట్ హాట్ చీర్ గర్స్ లో బికినీలను తలపించే చిట్టిపొట్టి డ్రెస్సులు వేయించి డాన్సులు ఆడాడు కూడా. ఈ నేపథ్యంలో ఆయనపై ఇండీసెన్స్ కేసు నమోదైంది. చట్ట ప్రకారం మహిళలను ఇలా బహిరంగంగా అసభ్యంగా చూపించడం నేరం. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని మాథ్యూ సాజుపుల్లువాజి అనే పెరంబదూర్ వాసి, ఎర్నాకులం కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన కోర్టు షారుఖ్ పై కేసు నమోదు చేయాల్సిందిగా పల్లారివెట్టం పోలీసులను ఆదేశించింది.
షారుఖ్ నటించిన డాన్2 చిత్రం డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా 3000 ప్రింట్లతో విడుదలవుతోంది. ఇందులో షారుఖ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. రియలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'డాన్' మూవీకి సీక్వెల్. ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా లీడ్ హీరోయిన్ రోల్ చేస్తుండగా, లార దత్త, సమీర రెడ్డి, కునాల్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించ బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో బాక్సీఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.


Click it and Unblock the Notifications











