Independence Day 2023: ఉచితంగా ఆ దేశభక్తి చిత్రం ప్రదర్శన.. 582 స్క్రీన్లలో 10 రోజులపాటు!
స్వాతంత్రం.. ఈ పేరు ఎప్పుడూ విన్న తెలియని మ్యాజిక్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంతోమంది వీరులు పోరాటాలు చేసిన తమ ప్రాణాలు త్యాగం చేసి తీసుకొచ్చిందే ఈ ఫ్రీడమ్. స్వాతంత్య్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఎన్నో చిత్రాలు భారతీయ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. ప్రతీ ఏటా ఇండిపెండెన్స్ డే అయిన ఆగస్ట్ 15న దేశభక్తి చిత్రాలను వివిధ టీవీ ఛానెల్స్, ఓటీటీల్లో ప్రసారం చేస్తారు. వీటికి క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. అయితే ఇటీవల 77వ స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
దేశభక్తి సినిమాలు: దేశభక్తి ప్రధాన కథాంశాలతో ఉన్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ఈ చిత్రాలకు భాషాబేధాలు, మాస్, క్లాస్ వంటి తారతమ్యం ఉండదు. దేశభక్తి అనే ఒకే ఒక ఎమోషన్ ప్రేక్షకులందరినీ థియేటర్లలోకి రప్పించేలా చేస్తుంది. దేశం గొప్పతనాన్ని, ఔన్యత్వాన్ని చాటి చెబుతూ తెరకెక్కిన సినిమాలు అనేకం. అలాంటి ఓ దేశభక్తి సినిమాను తెలంగాణ సర్కారు ఉచితంగా ప్రదర్శించనుంది.

రాష్ట్ర సచివాలయంలో: తెలంగాణ రాష్ట్రంలో 76 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశభక్తి చిత్రమైన గాంధీ (Gandhi Movie) సినిమాను తెలంగాణలోని అన్ని థియేటర్లలో ఉచితంగా పది రోజులపాటు ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో గాంధీ చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ప్రత్యేక సమావేశం: విద్యార్థుల కోసం గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు, ఉన్నతాధికారులతోపాటు థియేటర్ల యాజమాన్యాలు పాల్గొన్నాయి.
జాతీయ స్ఫూర్తిని: "ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సావాల ముగింపు వేడుకలను రాష్ట్రా వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని చాటే విధంగా రాష్ట్రంలోని 582 స్క్రీన్లలో ఈనెల 14 నుంచి 24వ తేది (ఆగస్ట్ 14-24) వరకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నాం" అని ప్రత్యేక సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

లక్షలాది విద్యార్థులు: అంతేకాకుండా విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకురావడం, వాళ్లను క్షేమంగా గమ్య స్థానాలకు తీసుకెళ్లే విధంగా థియేటర్ల నిర్వాహకులు, విద్యాశాఖ, రవాణా శాక ఇతర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. వజ్రోత్సవలా ప్రారంభ సమయంలో సైతం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించగా.. లక్షలాది విద్యార్థులు వీక్షించారని తెలిపారు.


Click it and Unblock the Notifications











