twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశ‌భక్తిని రగిలించిన తెలుగు సినిమాలు (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 83 ఏళ్ల చరిత్ర కలిగిన టాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతూ బాలీవుడ్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీగా తన సత్తా చాటుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్నో గర్వించ దగ్గ సినిమాలు వచ్చాయి.

    అందులో దేశభక్తిని పెంపొందించే సినిమాలు ఎన్నో తెరకెక్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. వందేమాతరమ్, నా దేశం, దేశద్రోహులు లాంటి దేశభక్తి సినిమాలు తొలినాళ్ల ప్రేక్షకులను అలరించాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో దేశభక్తి అంశాలు ప్రస్పుటిల్లేలా కథలను ఎంచుకునే వారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు లాంటి సినిమాలు ఆ కోవకు చెందినవే.

    సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన 'అల్లూరి సీతారామరాజు' తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన దేశభక్తి సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాతి కాలంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'భారతీయుడు', వెంకటేష్ హీరోగా వచ్చిన 'సుభాష్ చంద్రబోస్', బాలకృష్ణ నటించిన 'పరమ వీర చక్ర', శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'మహాత్మా' లాంటి సినిమాలు కూడా దేశ భక్తి అంశాలను కలిగి ఉన్నాయి. చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్, స్టాలిన్, పవన్ కళ్యాణ్ నటించిన కొమురంపులి చిత్రాలను కూడా ఆకోవకు చెందినవిగానే చెప్పుకోవచ్చు.

    అయితే ఇటీవల వచ్చిన కొన్ని దేశభక్తి అంశాలతో కూడిన సినిమాలు ప్రేక్షకులను అలరించ లేక పోయాయి. అందుకు కారణం అందులో బలవంతంగా హీరోయిజం, కమర్షియల్ వ్యాల్యూస్ జొప్పించడమే అని చెప్పక తప్పదు. ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య పోకడలు కూడా ఈ జనరేషన్ వారిలో దేశభక్తి విలువలు తుడిచిపెట్టుకుపోతున్నాయనే వాదన కూడా ఉంది.

    యువతలో దేశభక్తిని రగిలించిన సినిమాల వివరాలు స్లైడ్ షోలో..

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు


    1974లో రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు' చిత్రం ప్రముఖ స్వాంతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటిష్ పాలకుల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సీతారామరాజు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నటించిన 100వ సినిమా ఇది. ఈ చిత్రంలో ఆయన టైటిల్ రోల్ చేసి. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

    వందే మాతరమ్

    వందే మాతరమ్


    వందేమాతరం వాహినీ పిక్చర్స్ వారి మొదటి చిత్రం. ఈ చిత్రానికి మరో పేరు మంగళసూత్రం. ఈ చిత్రం 1939లో విడుదలైంది. చిత్తూరు నాగయ్య, కాంచనమాల ఈ చిత్రంలో ముఖ్య పాత్ర ధరించారు.

    నా దేశం

    నా దేశం


    ఎన్టీఆర్, జయసుద, జమున కథానాయికలుగా 1982లో వచ్చిన సినిమా ‘నాదేశం'. యువ అనాధ చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా. ఈ చిత్రానికి కె.బాపయ్య దర్శకత్వం వహించారు. శ్రీ లలితా మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని తెరకెక్కించింది. చక్రవర్తి సంగీతం అందించారు.

    దేశ ద్రోహులు

    దేశ ద్రోహులు


    ఎన్టీఆర్, కాంతారావు, దేవిక, జానకి, శోభన్ బాబు ప్రధాన తారగణంగా 1964లో తెరకెక్కిన చిత్రం ‘దేశ ద్రోహులు'. బోళ్ల సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని శ్రీరామా పిక్చర్స్ సంస్థ నిర్మించింది. సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.

    బొబ్బిలి పులి

    బొబ్బిలి పులి


    బొబ్బిలి పులి 1982 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. దాసరి నారాయణరావు దర్వకత్వం వహించిన ఈచిత్రంలో ఎన్టీఆర్, శ్రీదేవి, మురళీమోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, జయచిత్రం ప్రభాకర్ రెడ్డి, అల్లురామలింగయ్య, ప్రసాద బాబు ముఖ్య తారాగణం.

    సర్దార్ పాపారావయుడు

    సర్దార్ పాపారావయుడు


    ఎన్.టి.రామారావు నటించిన సినిమాలలో ఇది ఒక ప్రఖ్యాతమైనది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980వ దశకం మొదట్లో నిర్మించిన ఈ చిత్రంలో రామారావు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం ధరించి ప్రేక్షకులను అలరించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఎన్టీఆర్, శ్రీదేవి, శారద ముఖ్య తారాగణం, శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. చక్రవర్తి సంగీతం అందించారు.

    భారతీయుడు

    భారతీయుడు


    ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించాడు. ఒక స్వాంతంత్ర సమరయోధుడు దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఏం చేసాడు అనేది కథాంశం. కమల్ హాసన్ సరసన మనీషా కొయిరాలా, ఊర్మిలా నటించారు.

    మహాత్మ

    మహాత్మ


    శ్రీకాంత్ హీరోగా రూపొందిన పొలిటికల్ డ్రామా చిత్రం మహాత్మ. ఒక వీధి రౌడీ గాందీ మార్గంలో ప్రయాణించి ఎలా మంచి వాడయ్యాడు అనే అంశాన్ని దర్శకుడు కృష్ణ వంశీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. 2009లో ఈచిత్రం విడుదలైంది.

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్


    వెంకటేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘సుభాష్ చంద్రబోస్'. స్వాతంత్ర్యం రాకముందు చోటు చేసుకున్న పరిణామాలను బేస్ చేసుకుని ఈచిత్రం తెరకెక్కింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో బాక్సాఫీసు వద్ద బొల్తాపడింది.

    పరమవీరచక్ర

    పరమవీరచక్ర


    బాలకృష్ణ హీరోగా దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన దేశభక్తి చిత్రం పరమ వీర చక్ర. 2011లో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది.

    కొమురంపులి

    కొమురంపులి


    పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొమురంపులి. ఈచిత్రంలో పవన్ కళ్యాన్ దేశభక్తి కలిగిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది.

    ఖడ్గం

    ఖడ్గం


    కృష్ణ వంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్య తారాగణంగా దేశభక్తిని పెంపొందించే అంశాలతో తెరక్కిచన ‘ఖడ్గం' చిత్రం 2002లో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది.

    చిరంజీవి ‘స్టాలిన్'

    చిరంజీవి ‘స్టాలిన్'


    2006లో రూపొందిన స్టాలిన్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ప్రతి మనిషి సమాజం కోసం, సాటి మనిషి కోసం తన వంతు సాయం చేయాలి అనే ఒక సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    ఠాగూర్

    ఠాగూర్


    దేశంలో పెరిగిపోయిన లంచగొండి తనంపై యుద్దం చేసేందుకు ఒక వ్యక్తి ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అవినీతికి వ్యతిరేకంగా భారీ నెట్వర్క్‌ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనే కథాంశంతో రూపొందిన ఈచిత్రానికి వివి వినాయక్ దర్శకుడు.

    English summary
    
 
 Tollywood is one of the biggest and oldest film industries of India and it has the history of 83 years. Ever year, Telugu film industry churns out the highest number of films and the number is second biggest after Bollywood. The industry explores most of the genres except one and that is films on patriotism. In recent years, younger generation of actors, directors and producers have hardly tried to make films with patriotism as backdrop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X