పవన్ ఫార్ములా.... బన్నీపైకి: గణేష్ మంత్రం పారేనా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍తో 'గబ్బర్ సింగ్' లాంటి హిట్ కొట్టిన నిర్మాత బండ్ల గణేష్, ప్రస్తుతం మెగా ఫ్యామిలోని మరో హీరో అల్లు అర్జున్(బన్నీ)తో ప్రస్తుతం 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కృత నిశ్చయంతో ఉన్న గణేష్..... తనకు తెలిసిన జిమ్మిక్కులన్నీ ప్రదర్శిస్తున్నారు.
సాధారణంగా సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే గణేష్...ఈ సారి 'గబ్బర్ సింగ్' విషయంలో పాటించిన కొన్ని సెంటిమెంట్లను 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం విషయంలో కూడా ఫాలో అవుతున్నాడు. గత సంవత్సరం గబ్బర్ సింగ్ చిత్రం ఫస్ట్‌లుక్ శివరాత్రి సందర్భంగా విడుదల చేసారు. తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా శివరాత్రిని పురస్కరించుకుని రిలీజ్ చేసారు.
గబ్బర్ సింగ్ చిత్రం మే 11న విడుదల చేయగా, ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని దానికంటే ఒక రోజు ముందుగా, అంటే మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు గణేష్. మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఉపయోగించిన ఫార్ములా బన్నీ విషయంలో వర్కౌట్ అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.
ఇద్దరమ్మాయిలతో సినిమా విషయానికొస్తే, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. శర వేగంగా సాగుతున్న ఈచిత్రం ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











