వివేకానందపై 3D మూవీ ఆవిష్కరణ

By Pratap

భారత దేశంలోనే మొట్ట మొదటి సారిగా స్వామి వివేకానందపై రూపొందించిన 3D మూవీ ఆవిష్కరణ జరిగింది. చెన్నయ్ లోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ఇస్రో శాస్త్రవేత్త, పద్మశ్రీ ఆర్.ఎం.వాసగం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ 3డి మూవీ ప్రదర్శించే స్టీరియోస్కోపిక్ మిషనరీని సమకూర్చుకోవడం కూడా భారత్ లో ఇదే తొలిసారి. యువతలో చైతన్య కలిగించే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ 3Dలో ప్రదర్శించారు. ఈ 3D చిత్రం వీక్షించిన వారంతా ఎంతో ఆశ్యర్యానికి, ఎక్సైట్‌మెంట్‌కు గురయ్యారని మఠం నుంచి విడుదలైన ఓ ప్రకటనలో వెల్లడించారు.

స్వామి వివేకానంద 150 జయంతిని పురస్కరించుకు నిర్వహించబోతున్న 'ఎక్ప్సీరియన్స్ వివేకానంద' అనే కార్య్రకమంలో భాగంగా 3D చిత్రాన్ని ఆవిష్కరించారు. యువత వివేకానందుడి ఆలోచనలను పునికి పుచ్చుకుని భారత దేశ అభివృద్ధితో పాటు, సంస్కృతిని కాపాడేందుకు ముందుకు రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రామకృష్ణ మఠాధిపతులు వెల్లడించారు. ఈ 3D చిత్రాన్ని అందరికీ చూపించే ప్రయత్నం కూడా మొదలు పెట్టారు.

ఇప్పటి వరకు భారత్ లో ఎలాంటి 3D చిత్రం రూపొందక పోవడంతో....వివేకానందుడిపై రూపొందించిన ఈ చిత్రం భారత దేశ మొట్ట మొదటి 3D చిత్రంగా రికార్డుల కెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X